Leading News Portal in Telugu

Rashid Khan: మంచి మనసు చాటుకున్న రషీద్ ఖాన్.. భూకంప బాధితులకు విరాళం


ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబరు 7న ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్సుల్లో సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. భూకంపం ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భూకంపం కారణంగా పశ్చిమ హెరాత్, ఫరా, బద్గీస్ ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో భూకంప బాధితులకు ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని విరాళంగా అందజేస్తానని రషీద్ ఖాన్ ఎక్స్ ఖాతా (ట్విట్టర్) ద్వారా తెలియజేశాడు.

రషీద్ Xలో ఇలా వ్రాశాడు. ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్సులలో (హెరాత్, ఫరా, బాద్గీస్) భూకంపం వచ్చిందని తెలిసిచాలా బాధ పడ్డానన్నాడు. నేను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్నాను. తరతరాలుగా డబ్బును సేకరించేందుకు త్వరలో ప్రచారాన్ని ప్రారంభిస్తానని రషీద్ ఖాన్ తెలిపారు. దీంతో ఈ పోస్ట్ లో చేసిన కామెంట్స్ తో రషీద్ ఖాన్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

భూకంపం కారణంగా భారీ విధ్వంసం సంభవించింది. ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 10,000 మంది గాయపడ్డారని తెలుస్తోంది. భూకంపం ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయని.. భూకంప తీవ్రత 6.3గా నమోదైంది.