Leading News Portal in Telugu

Israel: హమాస్ ఉగ్రవాదుల దుశ్చర్య.. ఒకే చోట 40 మంది చిన్నారులను హత్య


Israel: హమాస్ ఉగ్రవాదుల చేసిన దుశ్చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది యుద్ధం కాదు, ఊచకోతలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తలను తెగనరికారు. ఒక కిబుట్జ్‌లో ఏకంగా 40 మంది చిన్నారులను దారుణంగా చంపేశారు. కొందరు తలలు వేరి చేసి ఉన్నట్లు అక్కడికి వెళ్లిన మీడియా సంస్థల ప్రతినిధులు తెలిపారు.

హమాస్ ఉగ్రఘటనల్ని ప్రపంచాన్నికి తెలియజేసేందుకు అంతర్జాతీయ మీడియాను ఇజ్రాయిల్ సైనికులు ఓ కిబుట్జ్ వద్ద తీసుకెళ్లారు. ఈ ప్రాంతంలో 70 మంది నివాసితులను హమాస్ హతమార్చింది. ఇది యుద్ధం కాదు, ఊచకోత అని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ మేజర్ జనరల్ ఇవై వెరుట్ అన్నారు. పిల్లల్ని తల్లులు, తండ్రుల దగ్గర చూస్తాం, కానీ.. ఇక్కడ బెడ్రూంలు, సురక్షిత గదుల్లో చనిపోయి ఉండటం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మేము ఎప్పుడూ చూడని ఘటన, యూరప్ లో ఈ నరమేధం జరిగినప్పుడు మా అమ్మమ్మ, తాతయ్యలను చెబితే విన్నాం తప్పితే.. ప్రస్తుతం ఇలాంటి ఘటనల్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయిల్ లో మృతుల సంఖ్య 900లకు చేరింది. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడుల్లో గాజాలో 700మందికి పైగా మరణించారు. మరోవైపు హమాస్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయిల్ అట్టుడుకుతోంది. ఇప్పటికే 3 లక్షల మంది రిజర్వ్ సైన్యాన్ని సమీకరించింది. గాజా స్ట్రిప్ కి నీరు, విద్యుత్ కట్ చేసి అన్ని వైపుల నుంచి ఇజ్రాయిల్ సైన్యాలు చుట్టుముడుతున్నాయి. నేలపై నుంచి యుద్ధానికి సిద్ధమువుతోంది. యుద్ధం మీరు మొదలుపెట్టారు, మేము ముగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు హెచ్చరించారు.