Leading News Portal in Telugu

France: ఫ్రాన్స్‌ హై అలర్ట్.. ఇజ్రాయిల్-పాలెస్తీనా యుద్ధం నేపథ్యంలో ఉగ్రదాడి..


France: ఫ్రాన్స్‌ హై అలర్ట్.. ఇజ్రాయిల్-పాలెస్తీనా యుద్ధం నేపథ్యంలో ఉగ్రదాడి..

France: ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్ స్కూల్ లో శుక్రవారం కత్తి దాడి జరిగింది. ఈ దాడిలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయుడు మరణించాడు. అయితే ఈ ఘటన ఫ్రాన్స్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. దాడి చేసిన వ్యక్తి మతపరమైన నినాదాలు చేస్తూ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 20 ఏళ్ల టీచర్ని దారుణంగా పొడిచి చంపాడు, మరో ఇద్దర్ని నిందితుడు గాయపరిచాడు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అనాగరికి ఇస్లామిక్ ఉగ్రవాదం’ అంటూ దాడిని ఖండించారు.

ఫ్రాన్స్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డర్మానిన్ మాట్లడుతూ.. ఫ్రాన్స్ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నామని, ఈ దాడికి ఇజ్రాయిల్-పాలెస్తీనా యుద్ధంతో లింక్ ఉందని వెల్లడించారు. ఈ దాడికి ముందు మక్రాన్ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ వారు ఐక్యంగా ఉండాలని, ఇజ్రాయిల్- హమాస్ సంఘర్షణను ఇంటికి తీసుకురావడం మానుకోవాలని ప్రజలకు సూచించారు. పాలెస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్ లో ర్యాలీలను మక్రాన్ ప్రభుత్వం నిషేధించింది. ఇది జరిగిన తర్వాతి రోజే టీచర్ డొమినిక్ బెర్నార్డ్ హత్య చేయబడ్డాడు. దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన మక్రాన్, టీచర్‌కి నివాళులు అర్పించారు.

దాడికి పాల్పడిన వ్యక్తిని మహ్మద్ ఎం. అని గుర్తించారు. ఇతను అదే స్కూల్ లో పూర్వ విద్యార్థి. ఇతనికి రాడికల్ ఇస్లామిక్ శక్తులకు సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. నిందితుడు రష్యాలో పుట్టిన చెచెన్ మూలాలు ఉన్న వ్యక్తి. ఇటీవల కాలంలో ఫ్రాన్స్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడుతున్నాయి. 2015లో పారిస్ లో ముష్కరులు ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ తరువాత 2020లో మహ్మద్ ప్రవక్తను ఎగతాళి చేస్తూ కార్టూన్ వేశారని, ప్రతీకారం తీర్చుకునేందుకు శ్యామూల్ పాటీ అనే టీచర్ ని చెచెన్ యువకుడు తల నరికి చంపాడు.