
Afghanistan Earthquake: తాలిబాన్ పాలనతో పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్ఘానిస్తాన్ వరస భూకంపాలతో అల్లాడుతోంది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో ఆదివారం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా భూకంప తీవ్రత నమోదైంది. గత వారం పశ్చిమ హెరాత్ ప్రావిన్సుల్లో భూకంపం వచ్చిన చోటే మరోసారి భూకంపం చోటు చేసుకుందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత పశ్చిమ ప్రావిన్స్ రాజధాని హెరాత్ నగరానికి వాయువ్యంగతా 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర నమోదైంది. దీని తర్వాత 20 నిమిషాలకు మరోసారి 5.5 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. అయితే ఇప్పటి వరకు ప్రాణనష్టం గురించి అధికారులు ప్రకటించలేదు.
గత శనివారం రోజున ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం వల్ల 1000 మంది ప్రజలు మరణించారు. ఆ తరువాత నుంచి చాలా మంది ప్రజలు ఇంటి బయటే నిద్రిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో వరసగా ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 7న శనివారం రోజున 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పశ్చిమ, మధ్య భాగంలో అరేబియా, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్లు భూఅంతర్భాగంలో కదలికల వల్ల భూకంపాలు ఏర్పడుతున్నాయి. అందవల్లే తరుచుగా భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా కొండ ప్రాంతలకు సమీపంలో ఉండటం, మట్టి ఇళ్లలో నివసిస్తుండటం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.