
Pakistan: ప్రస్తుతం ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధంపైనే ప్రపంచ దృష్టి నెలకొంది. పలు దేశాలు ఇజ్రాయిల్‌కి సపోర్టు చేస్తుండగా, ఇస్లామిక్ దేశాలు హమాస్‌కి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో రాడికల్ ఇస్లామిక్ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయి. ఇదే విధంగా అమెరికాలో ఓ వ్యక్తి ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ముస్లిం బాలుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ దేశంలో చదువుకునేందుకు వచ్చిన పాలస్తీనా యువకులపై స్థానిక గుండాలు దాడి చేశారు. ఇద్దరిని కత్తితో గాయపరిచారు. అయితే ఈ ఘటనకు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదు. పంజాబ్ ప్రావిన్సులోని గుజ్రాల్ వాలా మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను స్థానిక గుండాలు వేధించారు. అయితే తమ తోటి మహిళా విద్యార్థులకు సాయంగా ఇదేమిటని ప్రశ్నించినందుకు గుండాలు కత్తితో దాడి చేశారు.
Read Also: Amit Shah: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను కొనసాగిస్తుంది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్రాన్‌వాలా మెడికల్ కాలేజీకి చెందిన అబ్దుల్ కరీమ్, ఖల్దూన్ అల్షేక్ తమ తోటి విద్యార్థిలను టీజ్ చేసినందుకు స్థానికులతో గొడవకు దిగారు. కాగా, ఆదివారం వీరిద్దరు తమ అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు కలిసి కత్తులతో దాడికి తెగబడ్డారు. గాయపడిన పాలస్తీనా విద్యార్థులను ఆస్పత్రికి తరలించామని, పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.