Leading News Portal in Telugu

Tata Motors: టాటా అంటే మామూలుగా ఉండదు.. సేప్టీలో ఈ రెండు కార్లకు పోటీనే లేదు..


Tata Motors: టాటా అంటే మామూలుగా ఉండదు.. సేప్టీలో ఈ రెండు కార్లకు పోటీనే లేదు..

Tata Motors: కార్ల సేఫ్టీ విషయానికి వస్తే టక్కున గుర్తు వచ్చే పేరు టాటా. అంతలా ఈ కార్లు సేఫ్టీ రేటింగ్స్ విషయంలో అత్యుత్తమ స్కోర్ సాధిస్తున్నాయి. దేశీయ దిగ్గజ కార్ మేకర్ అయిన టాటా తన కార్ల సేఫ్టీలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. చిన్న కార్ల నుంచి ఎస్‌యూవీ వరకు అదే ప్రమాణాలను పాటిస్తోంది. తాజాగా టాటా మోటార్స్ రిలీజ్ చేసిన టాటా హారియర్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ 2023 కార్లు కూడా గ్లోబన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్(గ్లోబర్ NCAP) క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ సాధించాయి. పటిష్టమైన డిజైన్, అధునాతన భద్రతా ఫీచర్లు ఇందుకు కారణంగా నిలిచాయి.

అడాల్స్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఈ రెండు ఎస్‌యూవీలు 34.00 పాయింట్లకు గానూ 33.05 పాయింట్లు స్కోర్ చేశాయి. చిల్డ్రన్స్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49కి గానూ 45 పాయింట్లు సాధించాయి. గ్లోబల్ NCAP టెస్లులో పరీక్షించిన మరే కారు కూడా ఈ స్థాయిలో స్కోరు సాధించలేదు. టాటా హారియర్, టాటా సఫారీ ఫెస్‌లిఫ్ట్ 2023 భద్రతలో వీటిని మించిన కార్లు ప్రస్తుతం ఇండియాలో లేవు.

Tata 2

గ్లోబల్ NCAP కఠినమైన క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్ ఫ్రంటల్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ను అంచనా వేస్తాయి. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్సీ)ని కూడా అంచనా వేస్తాయి. అత్యుత్తమ స్కోర్ సాధించాలంటే ఈ వాహనాలు తప్పనిసరిగా పాదచారుల రక్షణ, సైడ్ ఇంపాక్ట్ పోల్ సేఫ్టీ ప్రొటెక్షన్ అంచనాలను కలిగి ఉండాలి. రెండు ఎస్‌యూవీలు కూడా స్టేబుల్ బాడీ‌షెల్ నిర్మాణాన్ని ప్రదర్శించాయి. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ డిసెబుల్ స్విచ్‌ని కలిగి ఉన్నాయి. పాదచారుల రక్షణ కోసం UN127 మరియు GTR9 యొక్క అవసరాలను ప్రమాణంగా తీర్చారు. దీంతో పాటు ADAS ఫీచర్లను రెండు కార్లలో ఇస్తున్నారు.

టాటా సఫారీ, హారియర్ ఫేస్ లిఫ్ట్ 2023 కార్లు ఆరు ఎయిర్ బ్యాగులతో వస్తున్నాయి. దీంతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్, పానిక్ బ్రేక్ అలర్ట్, ఎలక్ట్రానిక్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), బ్రేక్‌ఫోర్స్ పంపిణీ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, అన్ని సీట్లకు త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉన్నాయి.

టాటా సఫారీ ఫేస్‌లిప్ట్ 2023 ధర రూ. 16.19 లక్షలు(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవ్వగా.. హారియర్ ఫేస్ లిఫ్ట్ 2023 రూ. 15.49 లక్షల(ఎక్స్-షోరూం) నుంచి అందుబాటులో ఉంది.