Leading News Portal in Telugu

Israel-Hamas War: సీనియర్ హమాస్ లీడర్ హతం.. ఇజ్రాయిల్ వైమానిక దాడిలో మృతి


Israel-Hamas War: సీనియర్ హమాస్ లీడర్ హతం.. ఇజ్రాయిల్ వైమానిక దాడిలో మృతి

Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి తెగబడ్డారు. గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశంచి చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా అత్యంత పాశవికంగా హత్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్నారుల తలలను నరికేశారు. ఈ దాడుల్లో 1400 మంది సామాన్య ప్రజలు మరణించారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

హమాస్ ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానం వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తోంది ఇజ్రాయిల్. ఈ దాడుల్లో గాజా వైపు 3000 మంది వరకు మరణించారు. ఇదిలా ఉంటే గాజాలోని ముఖ్యమైన హమాస్ నాయకులను ఒక్కొక్కర్ని ఏరిపారేస్తోంది ఇజ్రాయిల్. పాలస్తీనాలో హమాస్ నేతృత్వంలోని జాతీయ భద్రతా దళాల అధిపతి జెహాద్ మహీసెన్‌ని హతం చేసింది ఇజ్రాయిల్. మైమానిక దాడిలో మరణించినట్లు రాయిటర్స్ తెలిపింది. మెహెసెన్ తో పాటు అతని ఇంట్లో అనేక మంది కుటుంబ సభ్యులు కూడా ఈ దాడిలో మరణించారు.

పాలస్తీనా అనుబంధ వార్తా సంస్థ జెరూసలేం న్యూస్ నెట్వర్క్ గాజాలోని షేక్ రద్వాన్ పరిసర ప్రాంతాల్లో దాడి జరిగినలట్లు నివేదించింది. ‘‘గాజా స్ట్రిప్ లోని పాలస్తీనా జాతీయ భద్రతా దళాల కమాండర్ మేజర్ జనరల్ జెహాన్ మహీసెన్, అతని కుటుంబ సభ్యులు షేక్ రద్వాన్ పరిసర ప్రాంతంలోని అతని ఇంటిపై బాంబు దాడి జరగడంతో మరణించారని ఎక్స్(ట్విట్టర్)లో తెలిపింది.