Leading News Portal in Telugu

Gold Shop Robbery: దొంగతనం దాగేనా..? అక్కడ తప్పించుకున్నా..ఇక్కడ పట్టుకున్నారు


Gold Shop Robbery: దొంగతనం దాగేనా..? అక్కడ తప్పించుకున్నా..ఇక్కడ పట్టుకున్నారు

Gold Shop Robbery: వండుకోకుండానే వంటకాలాన్ని కంచం లోకి రావాలి అనుకున్నట్టు ఒళ్ళు వంచకుండానే డబ్బులు రావాలి అనుకున్నాడు ఓ యువకుడు. స్విగ్గి, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నంత సులువుగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం తగిన ప్లాన్ వేసాడు. ఓ రోజంతా బంగారం షాప్ లో బొమ్మల నిలుచున్నాడు. షాప్ మూసేసాక చేతి వాటం చూపించాడు. అయితే ఏ చోటి కర్మ ఆ చోటే అన్నట్టు బంగారం షాప్ లో చేసిన పని బట్టల షాప్ లో బయట పడింది. దొంగకి 10 ఏళ్ల శిక్ష పడనుంది. ఈ ఘటన పోలాండ్‌ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. పోలాండ్‌ లోని వార్సా నగరంలో ఓ యువకుడు బంగారం షాపుకు వెళ్లి అక్కడ మెనాక్విన్‌ (మోడల్ కోసం ఏర్పాటు చేసే బొమ్మలు) లాగా నిలబడ్డాడు. షాపులో ఉండే బొమ్మల పక్కన బొమ్మలాగే కదలకుండా మెదలకుండా నిలబడ్డాడు. పైగా చేతిలో ఓ చిన్న బ్యాగ్ కూడా పట్టుకుని బొమ్మలా నిలబడి చక్కగా మ్యానేజ్ చేశాడు. ఎంతలా నటించాడు అంటే అతడిని ఎవరు గుర్తుపట్టలేదు. బొమ్మల్లో బొమ్మగా కలిసిపోయాడు.

Read also:Car Accident: జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించ లేక పోయారు. ఆఖరికి కెమెరాల కంట కూడా పడకుండా పర్ ఫెక్ట్ గా షాపు మూసే వరకు బొమ్మలాగనే నిలబడ్డాడు. షాప్ మూసేసిన తర్వాత తన దగ్గర ఉన్న బ్యాగుని తనకి కావాల్సినంత బంగారంతో నింపేసుకున్నాడు. అనంతరం అక్కడ నుండి బయటకి వచ్చాడు. ఇంత వరకు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. అయితే ఆ యువకుడిలో నన్ను ఎవరు పట్టుకోలేరు అనే కాంఫిడెన్స్ పెరిగింది. ఆ కాంఫిడెన్స్ తోనే ఓ హోటల్ కి వెళ్లి బాగా తిని హోటల్ మూసేసే టైంకి అక్కడనుండి జారుకున్నాడు. అంతటి తో ఆగలేదు మరళ ఓ బట్టల షాప్ కి వెళ్ళాడు. అక్కడ తనకి కావాల్సిన బట్టలను సర్దుకున్నాడు. వేసుకు వచ్చిన బట్టలు తీసేసి నచ్చిన బట్టలు వేసుకున్నాడు. అయితే చివరికి బట్టల షాప్ సెక్యూరిటీకి దొరికి పోయాడు. దొంగని పట్టుకున్న షాప్ సెక్యూరిటీ పోలీసులకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దొంగని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు విచారించగా బంగారం షాప్ లో దొంతనం చేసిన ఘటన నుండి ఆ యువకుడు చేసిన అన్ని నేరాలు బయపడ్డాయి. ఈ విషయం పైన పోలీసులు మాట్లాడుతూ ఆ యువకుడికి కనీసం 10 సంవత్సరాల శిక్ష పడుతుందని పేర్కొన్నారు.