Leading News Portal in Telugu

China: పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకునేందుకు చైనా సిద్ధం..బట్ వన్ కండీషన్..



Xi Jinping

China: చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్ తో మరింతగా సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) కోసం బిలియన్ల కొద్దీ డబ్బును ఖర్చు పెడుతోంది చైనా. ఇక ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు అప్పులు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్‌ని కౌంటర్ చేయాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ తో తన సంబంధాలు బలంగా ఉండాలని చైనా భావిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లోని చైనీయులు ఇటీవల కాలంలో దాడుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో అక్కడి తిరుగుబాటుదారులు, ఉగ్రవాదుల జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో చైనా తన సంబంధాలను పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అక్కడ పనిచేస్తున్న చైనా సంస్థలు, సిబ్బంది భద్రతకు హామీ ఇవ్వాలని చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ చెప్పినట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ దేశంలో చైనా కీలక పెట్టుబడిదారుగా ఉంది. అయితే అక్కడి వేర్పాటువాద, ఇస్లామిక్ గ్రూపులు చైనా ప్రాజెక్టులు, చైనా సిబ్బందిని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతోంది.

Read Also: Italy PM Meloni: సామూహిక అత్యాచారాలపై వ్యాఖ్యలు..పార్ట్‌నర్‌తో విడిపోయిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

ఈ వారం చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ఫోరం సమావేశానికి పాకిస్తాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ గురువారం జిన్ పింగ్‌ని కలిశారు. సీపెక్ ప్రాజెక్టులో భాగంగా ఇండస్ట్రియల్ పార్కులు, వ్యవసాయం, మైనింగ్, న్యూ ఎనర్జీ, ప్రధాన కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో సహకారం పెంపొందించుకోవాలని జిన్ పింగ్ అన్నారు. అయితే అదే సమయంలో చైనా ప్రయోజనాలకు భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.

సీపెక్ కింద పాకిస్తాన్ లో చైనా 25 బిలియన్ డాలర్ల విలువైన 50 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, రోడ్, రైల్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కోసం మరో 65 బిలియన్ల ఇస్తానని చైనా తెలిపిందని పాక్ ప్రధాని కాకర్ అన్నారు. యూఎన్, ఎస్‌సీఓ ఫ్రేమ్ వర్క్ కింద అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్ పింగ్ అన్నారు.