
Israeli: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగడం లేదు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన విరుచుకు పడింది. ఇజ్రాయిల్ ప్రజల ఆర్తనాదాలు హమాస్ చెవికి వినపడలేదు. హమాస్ జరిపిన అతిక్రూరమైన దాడుల్లో 1400 మందికి పైగా మరణించారు. అలానే 200 మందిని బంధించింది హమాస్.. వాళ్లలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. అయితే నిన్న శుక్రవారం హమాస్ ఆ ఇద్దరు అమెరికన్లను విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో విజయం పొందే వరకు పోరాడతామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలో హమాస్‌ను తొలగించిన తర్వాత US మరియు ఇజ్రాయెల్ అధికారులు గాజా స్ట్రిప్ యొక్క భవిష్యత్తు గురించి చర్చింకుంటున్నాయి. అధికారులు ఐక్యరాజ్యసమితి మద్దతుతో యునైటెడ్ నేషన్స్ మరియు అరబ్ దేశాల మద్దతుతో మధ్యంతర ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.
Read also:Tammy Hurricane: భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
కాగా గాజా ఆపరేషన్‌ను విస్తరించవద్దని టర్కీ అధ్యక్షుడు ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ఇజ్రాయిల్ మాత్రం గాజాను ఆక్రమించుకోవాలని భావించడం లేదని పదేపదే నొక్కి చెప్తుంది. అయితే హమాస్ యొక్క నిరంతర పాలన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. కాగా గాజా పైన ఇజ్రాయిల్ చేస్తున్న భూదాడి పైన US ఆందోళన వ్యక్తం చేస్తుంది. గాజాలో మానవతా సంక్షోభాన్ని పరిష్కరిస్తూ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం తీవ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయడంతోపాటు గాజాకు వీలైనంత త్వరగా మానవతా సహాయం అందించడంపై దృష్టి సారించామని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు. హమాస్‌ను అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ తీవ్రవాద గ్రూపుగా గుర్తించాయి.