
Earthquake: నేపాల్‌లో మళ్లీ భూకంపం. ఈరోజు (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఏదైనా ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగిందా? లేక నష్టం లేదా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ నెల మొదటి వారంలోనూ నేపాల్‌లో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం అరగంటలో ఐదుసార్లు భూమి కంపించి నేపాల్‌లో విషాదాన్ని నింపింది. నేపాల్‌లో తీవ్ర భూకంపాల కారణంగా పలు భవనాలు కుప్పకూలాయి. కూలిన భవనం శిథిలాలు తొలగిస్తుండగా కుప్పలు తెప్పలుగా మృతదేహాలు కనిపించాయి. మొత్తం మరణాల సంఖ్య 3,600 దాటింది. వేలమంది గాయపడ్డారు. విషాద ఛాయలు వీడకముందే మరో భూకంపం వస్తుందని నేపాలీలు ఆందోళన చెందుతున్నారు.
నేపాల్‌లో నాలుగు సార్లు బలమైన భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే.. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో కూడా దీని ప్రభావం కనిపించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం బలమైన భూకంపం వచ్చింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, హాపూర్, అమ్రోహా, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లో మధ్యాహ్నం మొదటి భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ గుర్తించింది. NCS దీనిని 5.3 తీవ్రతతో గుర్తించింది మరియు అనేక పదుల కిలోమీటర్ల భూగర్భంలో కేంద్రీకృతమై ఉంది. దీనిని గుర్తించిన అరగంట లోపే భూమి 3.06 వద్ద 6.3 తీవ్రతతో మళ్లీ కంపించింది.
ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ గుర్తించింది. దీని కేంద్రం బజాంగ్ జిల్లాలో ఉంది. ఆ తర్వాత భూమి స్వల్పంగా కంపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం కారణంగా ఒక విద్యార్థితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు మరియు అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి. విద్యార్థి భయంతో రెండంతస్తుల భవనంపై నుంచి దూకినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బజాంగ్‌లో జిల్లా పోలీసు కార్యాలయ భవనంతో పాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఖాట్మండుతో పాటు అచ్చం, దోటి, బజురా, బైతాడి జిల్లాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. నేపాల్‌లో రెండోసారి భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లు, కార్యాలయాల్లోని లైట్లు, ఫ్యాన్లు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ తతంగంపై ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
Mahesh Babu: మావా… మాట తప్పారుగా?