
Iran: ఇరాన్ దేశం పూర్తిగా మతాచారాలపై ఆధారపడిన రాజ్యం. అక్కడ అందరు విధిగా మత చట్టాను పాటించాల్సిందే. ముఖ్యంగా మహిళ హిజాబ్ అంశంపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. గతేడాది హిజాబ్ సరిగా ధరించలేదని చెబుతూ.. కుర్దిష్ మహిళ మహ్సా అమినిని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరణించింది. అమిని మరణం ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో మహిళ మహ్సా అమిని లాగే చావుకు దగ్గరైంది. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మత అధికారులు దాడులు చేయడంతో మరో టీజేజర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం నివేదించింది. 16 ఏళ్ల అర్మితా గెరావాండ్‌ను హిజాబ్ ధరించనునందుకు అధికారులు కొట్టారు. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది, ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయింది.
చివరిసారిగా గెరావాండ్ ఆస్పత్రిలో చేరడాన్ని కుర్దిష్-ఇరానియన్ హెంగావ్ వంటి హక్కుల సంఘాలు మొదటిసారిగా వెలుగులోకి తీసుకువచ్చాయి. 16 ఏళ్ల బాలిక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ సమయంలో ఆమె లైఫ్ సపోర్టుతో, తలకు కట్టుతో కనిపించింది. గెరావండ్ ఆరోగ్యంపై వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె బ్రెయిన్ డెడ్ కావడం ఖాయమని తెలుస్తోందని ఆ దేశ మీడియా తెలిపింది.
గతేడాది మహ్స అమిని ఎదుర్కొన్న విధినే తాజాగా గెరావాండ్ ఎదుర్కొంటుందని అక్కడి హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా ఘటన ఇరాన్ లోని మతాధికార పాలకులకు సవాల్ గా నిలువబోతోంది. అక్టోబర్ 1న టెహ్రాన్ మెట్రోలో ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అమలు పరుస్తున్న సమయంలో గెరావండ్ గాయపడ్డారు. అయితే దీనిని ఇరాన్ ఖండిస్తోంది.
1979 తర్వాత ఇరాన్ లో మతపాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి మహిళలపై ఆంక్షలు, కఠినమైన డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నారు. పాటించని వారికి మందలింపులు, జరిమానాలు విధిస్తున్నారు. గతేడాది మహ్సా అమిని మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తునలేసింది. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేసింది. ఈ ఆందోళనల్లో 500 మందికి పైగా చనిపోయారు.