Leading News Portal in Telugu

Earthquake: నేపాల్‌లో 4.3 తీవ్రతతో భూకంపం.. 24 గంటల్లో రెండోసారి



Earthquake

Earthquake: హిమాలయ దేశం నేపాల్ వరస భూకంపాలతో వణికిపోతోంది. ఆదివారం రెండుసార్లు భూకంపాలు వచ్చాయి. తాజాగా రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.

Read Also: Iran: మహ్సా అమిని మరణాన్ని కవర్ చేసిన ఇద్దరు మహిళ జర్నలిస్టులకు జైలు శిక్ష..

అంతకుముందు ఆదివారం తెల్లవారుజామున నేపాల్ లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అంతకుముందు అక్టోబర్ 7న 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.

నేపాల్ దేశంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పూర్తిగా హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ దేశంలో భూకంప ప్రమాదాలు ఎక్కువ. ఈ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యూరేషియా టెక్టానిక్ ప్లేటును ఉత్తరం దిశగా ముందుకు తోస్తోంది. దీని వల్ల ఏర్పడిన శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది.