Leading News Portal in Telugu

Callitxe Nzamwita:: మహిళలు అంటే భయం.. ఇంట్లోనే అన్నీ కానిచ్చేస్తున్న వ్యక్తి


Callitxe Nzamwita:: మహిళలు అంటే భయం.. ఇంట్లోనే అన్నీ కానిచ్చేస్తున్న వ్యక్తి

Callitxe Nzamwita: అమ్మాయి చూస్తే చాలు అనుకునే వాళ్ళు కొందరు.. అమ్మాయిల్ని ద్వేషించే వాళ్ళు కొందరు ఈ రెండు క్యాటగిరీ వ్యక్తుల్ని మనం చూసే ఉంటాము. కానీ అమ్మాయిల్ని చూసి భయపడే పురుషులు కూడా ఉంటారా? అంటే ఉంటారు. అవును మీరు విన్నది నిజమే.. ఓ వ్యక్తి ఆడవాళ్ళని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. ఆడవాళ్ళకి భయపడి దశాబ్ధాలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. వివరాలలోకి వెళ్తే.. రువాండాకు చెందిన కాలిటీస్ నిజాంవిత అనే వ్యక్తికి ఆడవాళ్లు అంటే భయం. ఈ కారణం చేత అతను 16 సంవత్సరాల వయసు నుండి ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు. అతను 55 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. తాను నివసించే ఇంట్లోకి ఏ మహిళా రాకూడదని తన ఇంటి చుట్టూ ఎవరు ప్రవేశించడానికి వీలులేకుండా 15-అడుగుల కంచెను నిర్మించాడు. అయితే తాను ఆ ఇంటి ఆవరణ ధాటి భయటకు రాడు. కాలకృత్యాలు కూడా ఆ ఇంటి ఆవరణలో ఉన్న ఓ గోతిలోనే తీర్చుకుంటాడు.

Read also:Jammu Kashmir: ఉరి సెక్టార్‌లో చొరబడిన పాక్‌ ఉగ్రవాదులు.. కాల్చిపడేసిన భారత సైన్యం..!

ఆ వ్యక్తి ఇంటి పక్కన నివసించే ఓ మహిళా దక్షిణాఫ్రికా మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తికి ఆడవాళ్లను చూస్తే భయం అని.. పొరపాటున ఎవరైనా స్త్రీ ఆ చుట్టుపక్కల కనిపిస్తే వెంటనే ఇంట్లోకి పరిగెత్తి తలుపు వేసుకుంటాడని తెలిపింది. అయితే అతను చాల పేదవాడిని.. స్త్రీ అంటే భయం ఉండడం చేత అతను ఎక్కడికి వెళ్లడని.. అతనికి కావాల్సిన ఆహరం.. వస్తువులను అతని ఇంటి ఆవరణలోకి విసిరేస్తామని.. వాటిని అతను తీసుకుంటాడని తెలిపింది. అయితే అతనితో మాట్లాడానికి ప్రయత్నిస్తే అతను భయం తో ఇంట్లోకి పరుగుతీస్తాడని పేర్కొంది. కాగా ఇలా ఎవరైనా పురుషులు ఆడవాళ్లను చూస్తే విభయపడుతున్నారు అంటే వాళ్ళు గైనోఫోబియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్నారని అర్ధం.