Leading News Portal in Telugu

Viral News: బాత్ రూంలో చెయ్యాల్సిన పని బీర్ ట్యాంకులో చేసావేందిరా అయ్యా..!


Viral News: బాత్ రూంలో చెయ్యాల్సిన పని బీర్ ట్యాంకులో చేసావేందిరా అయ్యా..!

Viral news: ప్రస్తుత కాలంలో మద్యం ప్రియులు చాలామందే ఉన్నారు. ఆడా మగా అనే బేధం లేకుండా వీకెండ్ వస్తే చాలు చాలంది బీర్ బాటిల్ వెనక పరిగెడుతుంటారు. గ్లామర్ పెంచుకోవడానికి కొందరు.. ఫ్రేస్టేషన్ దించుకోవడానికి కొందరు. లవ్ ఫెయిల్యూర్ అని లైఫ్ ఫెయిల్యూర్ అని ఇలా ఏదో ఒక రీసన్ తో బార్ కెళ్ళి బీరు తాగుతారు. ఇంకొందరు ఇంటిని బార్ గా మార్చేస్తారు. అయితే బీర్ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగి చేసిన పని గురించి తెలిస్తే గతంలో తగిన బీర్ కూడా వర్తమానంలో బయటకి కక్కేస్తారు. ఇంతకీ ఎం అయింది అనుకుంటున్నారా..? ఓ ఉద్యోగి ఎక్కడ చోటు లేనట్టు బీర్ ట్యాంక్ లో మూత్ర విసర్జన చేసాడు. ఈ ఘటన చైనా లో చోటు చేసుకుంది. వివారాలలోకి వెళ్తే.. చైనా లో ప్రముఖ బీర్ కంపెనీ అయిన సింగ్‌టావో బ్రూవరీ గోదాములో క్లిప్, హెల్మెట్, యూనిఫాం ధరించిన ఓ ఉద్యోగి ఎత్తైన గోడపైకి ఎక్కి కంటైనర్‌ లోకి మూత్ర విసర్జన చేశారు.

Read also:Alaska Airlines: ఆకాశంలో ఆగమాగం.. గాల్లో ఉన్న విమానం ఇంజన్ ఆపేందుకు ప్రయత్నించిన పైలెట్ అరెస్ట్

కాగా ఆ కంపెనీకి సంబంధించిన మరో ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనితో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ ని కైవసం చేసుకుని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్త తెలుసుకున్న కంపెనీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసింది. మూత్రం పోసిన బీరు బ్యాచ్ పదార్థాలను సీలు చేసింది. సింగ్టావో చైనా యొక్క అగ్ర బీర్ ఉత్పత్తిదారులలో ఒకటి. కాగా సంఘటనపై స్పందించిన కంపెనీ యజమాన్యం.. పోలీసులను సంప్రదించామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. అయితే ఈ ఘటన కారణంగా సింగ్ టావో షేరు ధర ఆమాంతం పడిపోయింది. సోమవారం ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైనప్పుడు కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. అయితే మధ్యాహ్నం వరకు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయని అవుట్‌లెట్ నివేదించింది. చైనా బీరు కంపెనీ బ్రాండ్ కు తీరని నష్టం జరిగిందని చైనా వాసులు తెలిపారు.