
Vladimir Putin: మంగళవారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని.. అయన ఉన్నటుండి నేలపైన పడిపోయారని.. ఈ నేపథ్యంలో శబ్దం వినపడగా భద్రత సిబ్బంది పుతిన్ దగ్గరకి వచ్చి నేలపైన పడున్న పుతిన్ ను ఆసుపత్రికి తరలించారని సదరు టెలిగ్రామ్ ఛానల్ తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ఈ వార్త పైన స్పందించిన క్రెమ్లిన్ స్పష్టతనిచ్చింది. పుతిన్ ఆరోగ్యం పైన అంతర్జాతీయ మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అసత్యాలే అని తేల్చి చెప్పింది క్రెమ్లిన్. పుతిన్ ఆరోగ్యంగా దృడంగా ఉన్నారని తెలియ చేసింది. కాగా ఈ తరుణంలో పుతిన్ తనలాంటి మరో వ్యక్తిని డూప్‌గా ఉపయోగిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. వస్తున్న ఈ వదంతులపైనా క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. వస్తున్న ప్రచారాల్లో నిజం లేదని అవన్నీ అసత్య ప్రచారాలే అని పేర్కొన్నారు. కాగా 2020లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పుతిన్.. తన డూప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు.
Read also:Komatireddy Venkat Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి.. అండగా ఉంటా
అవన్నీ అవాస్తవాలే అని అప్పట్లో స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా గతంలో ఒకసారి డూప్‌ను ఉపయోగించుకున్నట్లు వివరించారు. కాగా గత ఏడాది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం పైన వదంతులు పుట్టుకొస్తున్నాయి. పుతిన్ కి క్యాన్సర్ ఉందని,
పార్కిన్సన్స్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ వసరుస కథనాలు హల్చల్ చేశాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని రష్యా అధికారులు ఖండిస్తూ వచ్చారు. అవన్నీ వదంతులే అని, ఆ వార్తల్లో నిజం లేదని.. అవన్నీ అసత్యాలేనని.. అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నారని రష్యా నేతలు చెప్పుకొచ్చారు.