Leading News Portal in Telugu

US Gun Firing: అమెరికాలో దుండగుల కాల్పులు.. 22 మంది మృతి!


US Gun Firing: అమెరికాలో దుండగుల కాల్పులు.. 22 మంది మృతి!

At Least 22 Killed in Mass Shooting in US: యునైటెడ్ స్టేట్స్‌ (అమెరికా)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బుధవారం మైనే, లెవిస్టన్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారని ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడ్డారని పేర్కొంది. సమాచారం అందుకున్న యూస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

దుండగులు కాల్పులు జరిపే స్థానంలో రైఫిల్ పట్టుకుని ఉన్న రెండు పోటోలను ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. నిందుతులు పరారీలో ఉన్నాడని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. నిందుతుల కోసం యూస్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.