
USA: ఇరాన్ లోని హమాస్ అధికారి, ఇరాన్ లోని రివల్యూషనరీ గార్డ్ సభ్యులతో సహా ఇటీవల ఇజ్రాయిల్ పై దాడికి తెగబడిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అమెరికా రెండో రౌండ్ ఆంక్షలు విధించింది. హమాస్ ఇన్వెస్టిమెంట్ ఫోర్ట్‌ఫోలియోలోని ఆదనపు ఆస్తులను లక్ష్యంగా చేసుకుని, హమాస్ అనుబంధ కంపెనీలపై ఆంక్షల ఎగవేతను సులభతరం చేసే వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరాన్ హమాస్ తో పాటు లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లకు సాయం చేస్తుందని ఇజ్రాయిల్, అమెరికా ఆరోపిస్తున్నాయి.
Read Also: Qatar: 8 మంది భారతీయులకు మరణశిక్ష.. ఇజ్రాయిల్ కోసం గూఢచర్యమే కారణం..?
హమాస్, పాలస్తీన ఇస్లామిక్ జిహార్ గ్రూపులకు అక్రమ ఇరానియన్ నిధులకు మధ్యవర్తిగా పనిచేసిన గాజాలోని ఓ సంస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ తెలిపింది. హమాస్ ఆర్థిక కార్యకలాపాలు, నిధుల ప్రవాహాలను అడ్డుకోవడంతో పాటు హమాస్ వంటి ఉగ్రవాద సంస్థల బలాన్ని తగ్గించేందుకు వెనకాబోమని డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాలీ అడెయెమో అన్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్ సంస్థ తీవ్రమైన దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. 200కు పైగా ప్రజల్ని బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు గాజాలోకి తరలించారు. చనిపోయిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరంగా వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 7000 కన్నా ఎక్కు వ మంది పాలస్తీనియన్లు చనిపోయారు.