Leading News Portal in Telugu

Blockade of the Gaza: భూతల యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్.. గాజాలో ఇంటర్నెట్ కట్


Blockade of the Gaza: భూతల యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్.. గాజాలో ఇంటర్నెట్ కట్

Blockade of the Gaza: అక్టోబర్ 7 వతేదీన మోగీన యుద్ధ బేరి నేటికీ వినపడుతూనే ఉంది. ఇజ్రాయిల్ పై హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో 1450 మందికి పైగా చనిపోయారు. కాగా హమాస్ విచక్షణారహిత దాడులకు బదులు తీర్చుకుంటాం.. హమాస్ ను నాశనం చేస్తామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్లుగానే హమాస్ పైన ప్రతీకార దాడులను జరుపుతుంది. ఇప్పటికే గాజా పైన ఇజ్రాయిల్ చేసిన ప్రతీకార దాడిలో 7,326 మంది మరణించినట్లుగా హమాస్ ఆరోగ్య శాఖా అధికారులు ప్రకటించారు. కాగా మరణించిన వారిలో ఎక్కువ శాతం పౌరులు, చిన్నపిల్లలు ఉన్నట్లు తెలిపారు. కాగా నిన్న రాత్రి కూడా గాజా లోకి రెండు వరుస యుద్ధ ట్యాంకులు ప్రవేశించాయి. అనంతరం ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. చివరి రోజుల వరుస దాడులను అనుసరించి భూ బలగాలు టునైట్ గ్రౌండ్ ఆపరేషన్‌ను పొడిగించాయని పేర్కొన్నారు.

Read also:Bapatla Crime: అనుమానాస్పద స్థితిలో ఏఎస్సై మృతి.. కారణం ఇదేనా..?

కాగా ఇజ్రాయెల్ గాజాలో తన భీకర బాంబు దాడులను ముమ్మరం చేసే నేపథ్యంలో గాజా స్ట్రిప్ అంతటా ఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిందనే విమర్శలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యూమన్ రైట్స్ వాచ్, NGO గాజాలో తీవ్రమైన బాంబు దాడులు జరుగుతున్న సమయంలో కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్నెట్, ఫోన్ల సేవలను నిలిపివేయడం ద్వారా సామూహిక దురాగత చర్యలను ప్రేరేపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ అంతటా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసి కమ్యూనికేషన్‌ కట్ చేసిందని.. గాలి, భూమి, సముద్రం అన్ని వైపుల నుండి ప్రతీకార దాడులు చేసి ఊచకోతలకు పాల్పడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు హమాస్ పేర్కొంది. కాగా ఈ ఆరోపణలను ఇజ్రాయిల్ ఖండించింది.