Leading News Portal in Telugu

Israel-Hamas War: మెట్రో సొరంగాల వెబ్‌లో హమాస్ తీవ్రవాదులు.. ఇజ్రాయిల్ కు సవాల్


Israel-Hamas War: మెట్రో  సొరంగాల వెబ్‌లో హమాస్ తీవ్రవాదులు.. ఇజ్రాయిల్ కు సవాల్

Hamas, metro webs of tunnels, Israel, Israel-hamas war, international news,
హమాస్ ఇజ్రాయిల్ మధ్య మోగిన యుద్ధ బేరి 21 రోజులు గడిచిన ఇంకా వినపడుతూనే ఉంది. హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో ఇజ్రాయిల్లో 1400 మంది పైగా ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపధ్యంలో ఇజ్రాయిల్ హమాస్ పైన ప్రతీకార దాడికి పూనుకుంది. ఇజ్రాయిల్ గాజా పైన చేసిన ప్రతీకార దాడుల్లో 7200 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికి ఇజ్రాయిల్ గాజా పైన తన ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. అయితే హమాస్ ను నాశనం చేస్తాని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్లుగానే హమాస్ పైన దాడులు జరుపుతున్నా.. హమాస్ ను పూర్తిగా శిథిలావస్థకు తేవాలి అనుకునే ఇజ్రాయిల్ కి గాజా స్ట్రిప్ లోని సొరంగాలు సవాల్ విసురుతాన్నయి. స్మగ్లింగ్ కోసం అలానే యుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించే విస్తారమైన సొరంగాల నెట్‌వర్క్ గాజా స్ట్రిప్ క్రింద ఉంది .

Read also:Raashi Khanna: ముసిముసి నవ్వులతో మైమరిపించే అందాలతో అలరిస్తున్న రాశి ఖన్నా..

అండర్‌గ్రౌండ్ టన్నెల్ నెట్‌వర్క్ ని ఆయుధాల నిల్వ కోసం, రవాణ కోసం, పౌరులకు యుద్ధ కిక్షణ ఇచ్చేందుకు, కమ్యూనికేషన్ కోసం, ప్రమాదకర దాడులను ప్రారంభించేందుకు, బందీలను దాచేందుకు, తరలించేందుకు, ఇజ్రాయిల్ సైన్యానికి కనిపించకుండా దాకునేందుకు హమాస్ ఉపయోగిస్తుంది. ఈ సొరంగాలకు సంబంధించిన సమాచారం ఎవరికీ తెలియదు. ఎందుకంటే హమాస్ సొరంగాల వివరాలను చాల రహస్యంగా ఉంచుతుంది. ఆ సొరంగాలు ధ్వసం చేస్తేనే హమాస్ పై ఇజ్రాయిల్ చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చగలదు.ఈ క్రమంలో ఇటు భూమి పైన అటు సొరంగాలల్లో ఒకేసారి యుద్ధం చేయడం ఇజ్రాయిల్ కి పెద్ద సలవాలుగా మారింది. కాగా శనివారం రాత్రి, ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ను టార్గెట్ చేస్తూ ఉత్తర గాజాలోని 150 భూగర్భ సొరంగాలను యుద్ధ విమానాల ద్వారా ఛేదించారు. ఈ నేపథ్యంలో వాటిని, పోరాట ప్రదేశాలు,ఇతర భూగర్భ మౌలిక సదుపాయాలుగా పేర్కొన్నారు. గాజాలో తన భూ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో దాడులు జరిగాయి.