Leading News Portal in Telugu

Mouse Embryos In Space: జపనీస్ సైంటిస్టుల ఘనత.. అంతరిక్షంలో ఎలుక పిండాల అభివృద్ధి..


Mouse Embryos In Space: జపనీస్ సైంటిస్టుల ఘనత.. అంతరిక్షంలో ఎలుక పిండాల అభివృద్ధి..

Mouse Embryos In Space: జపనీస్ సైంటిస్టులు అరుదైన ఘనత సాధించారు. ఎలుక పిండాలను అంతరిక్షంలో అభివృద్ధి చేశారు. ఈ అధ్యయనం ద్వారా మానవులు కూడా అంతరిక్షంలో పునరుత్పత్తి చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం సూచిస్తోందని సైంటిస్టులు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ యమనాషి అడ్వాన్స్‌డ్ బయోటెక్నాలజీ సెంటర్ ప్రొఫెసర్ తెరుహికో వాకయామా మరియు జపాన్ ఏరోస్పేస్ స్పేస్ ఏజెన్సీ (జాక్సా) బృందం ఈ పరిశోధనను చేసింది. దీని కోసం ఆగస్టు 2021లో రాకెట్ ద్వారా గడ్డకట్టిన స్ఠితిలో ఎలుక పిండాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి పంపారు.

వ్యోమగాములు దీని కోసం ప్రత్యేక పరికారాన్ని ఉపయోగించి ప్రారంభ దశలో ఉన్న పిండాలను కరిగించి నాలుగు రోజుల పాటు స్టేషన్ లో ఉంటారు. మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో పిండాలు అభివృద్ధి చెందినట్లు సైంటిస్టులు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా సంతానోత్పత్తిపై గురుత్వాకర్షణ గణనీయమైన ప్రభావాన్ని చూపదని స్పష్టం చేస్తుందని సైంటిఫిక్ జర్నల్ ఐసైన్స్ లో పరిశోధకులు తెలిపారు.

భూమిపై ఉన్న తమ ప్రయోగశాలలకు పిండాలను తిరిగి పింపిన తర్వాత బ్లాస్టోసిస్ట్ లను విశ్లేషించితన తర్వాత డీఎన్ఏ, జన్యువుల్లో ఎలాంటి గణనీయమైన మార్పులు రాలేదని పరిశోధకులు చెప్పారు. క్షీరదాలు అంతరిక్షంలో వృద్ధి చెందగలవని చూపించే మొట్టమొదటి అధ్యయనం ఇదే అని యమనాషి విశ్వవిద్యాలయం మరియు జాతీయ పరిశోధనా సంస్థ రికెన్ శనివారం సంయుక్త ప్రకటనలో తెలిపారు.

భవిష్యత్మతులో బ్లాస్టో సిస్టులు సాధారణమైనవిగా నిర్థారించడానికి ఎలుకలు జన్మిస్తాయో లేదో చూడటానికి ఐఎస్ఎస్ మైక్రోగ్రావిటీలో కల్చర్ చేయబడిని బ్లాస్టోసిస్టులను ఎలుకల్లోకి మార్పిడి చేయడం అవసరం అని తెలిపారు. అంతరిక్షంలో కాలనీలు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్న మానవులకు ఈ ప్రయోగం ఎంతో కీలకంగా మారింది.