
Survival Story: మహా సముద్రంతో తప్పిపోవడం అంటే చావుకు దగ్గర కావడమే, ఇలా ఎంతో మంది మరణించారు. అయితే కొందరు మాత్రం ప్రాణంపై ఆశ వదలకుండా కొన్ని నెలల పాటు సముద్రంలో లేకపోతే దిక్కులేని ద్వీపాల్లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. మనుగడ కోసం వారి పోరాటమే వారిని కాపాడింది. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి.
తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తి సముద్రంలో ఒంటరిగా చిక్కుకుపోయిన రెండు వారాల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. తప్పిపోయిన మత్స్యకారుడు అమెరికా పశ్చిమ తీరానికి 110 కిలోమీటర్ల దూరంలో లైఫ్ బోటులో సజీవంగా కనిపించాడు. తప్పిపోయిన మత్స్యకారుడి ఆచూకీ కోసం ఒక రోజు ముందే అన్వేషణను నిలిపివేసింది. ఆ తర్వాత రోజే అతను సజీవంగా కనిపించాడు. రెండు వారాలుగా సాల్మన్ చేపల్ని తింటూ ప్రాణాలతో బయటపడ్డాడు.
అక్టోబర్ 12 వాషింగ్టన్ రాష్ట్రంలోని గ్రేస్ హార్బర్ నుంచి బయలుదేరాడు. ఆ తరువాత తప్పిపోయాడు. అయితే కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని వాంకోవర్ ద్వీపంలోని సూక్ పట్టణానికి చెందిన ర్యాన్ ప్లేన్స్ అతని అంకుల్ జాన్, తప్పిపోయిన వ్యక్తిని గుర్తించినట్లు సియాటెల్ లోని కింగ్ టీవీ వెల్లడించింది.
నేను దూరం నుంచి ఓ లైఫ్ బోట్ ను చూశారు, బైనాక్యులర్ తో చూశాను, అతను తన గుర్తింపు కోసం ఫైర్ చేశాడని ర్యాన్ వెల్లడించారు. మేము అతడిని మా బోట్ లోకి తాగాము, మమ్మల్ని వెంటనే భావోద్వేగంతో కౌగిలించుకున్నాడని తెలిపాడు. తాను 13 రోజులగా ఒంటరిగా లైఫ్ బోట్ లో ఉన్నానని, బతకడానికి సాల్మన్ చేపలు తిన్నానని సదరు వ్యక్తి చెప్పారు.
మేము అతడికి టిఫిన్ పెట్టామని, మూడు బాటిళ్ల వాటర్ తాగానని, తను చాలా ఆకలితో ఉన్నాడని అతడిని రక్షించిన వారు చెప్పారు. కెనడియన్ కోస్ట్ గార్డ్ మరియు మరొక కెనడియన్ రెస్క్యూ ఏజెన్సీ ద్వారా అతన్ని తిరిగి ఒడ్డుకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. తదుపరి చికిత్స కోసం ఆ వ్యక్తిని బ్రిటిష్ కొలంబియాలోని టోఫినోలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కింగ్-టీవీ నివేదించింది.
తప్పిపోయిన వ్యక్తితో పాటు మరో నావికుడు అక్టోబర్ 15న తిరిగి రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఎనిమిది గంటలకు పైగా సిబ్బంది 14000 చదరపు మైళ్ల సముద్రంలో అణ్వేషించిందని అన్నారు. అతనితో పాటు బయలుదేరిన మరో నావికుడు కొనుగొనబడలేదని, కోస్ట్ గార్గు ఈ సంఘటనను విచారిస్తున్నట్లు తెలిపారు.