
America: ఏ పనినైనా రెప్పపాటు కాలంలో చేయగా నైపుణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI )లో ఉంటుంది. అయితే ఆ నైపుణ్యాన్ని సృష్టించిన మానవ మేధస్సు నైపుణ్యం ఇంకెంత గొప్పదో కదా. అయితే AI కారణంగా మానవ మేధస్సు ప్రభావితం కానుంది. ఎందుకంటే మానవ మేధస్సుకి నిదర్శనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి ఆలోచించే అవకాశాన్ని ఇవ్వదు. మనిషి ఎప్పుడు సులువైన మార్గాన్నే ఏంన్చుకుంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని పనులు చేస్తున్నప్పుడు మనిషి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటాడు. దీని కారణంగా ఆలోచించాల్సిన అవసరం లేనందున మెదడుని ఉపయోగించరు. తద్ద్వారా ఆలోచన శక్తి, నైపుణ్యం తగ్గిపోతాయి. అందుకే యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవ మేధస్సుకి ముప్పు పొంచి ఉందని, అలానే మనుషులు ఉపాధిని కోల్పోతారని ఆందోళన చెందుతుంది.
Read also:Chinta Mohan: చంద్రబాబుకు బెయిల్ సంతోషకరం.. మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దు..!
ఈ క్రమంలో సోమావారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కృత్రిమ మేధస్సును నియంత్రించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (EO) పై సంతకం చేశారు. ఈ ఆర్డర్ తరువాత భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని AIలో కొత్త ప్రమాణాలు సిద్ధం చేయబడనున్నాయి. ఈ నేపథ్యంలో జోబైడెన్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది . అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గత 50 సంవత్సరాలలో చూడని సాంకేతిక మార్పలు కేవలం ఈ 5 -10 సంవత్సరాలలో చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే మానవ మేధస్సుకు ముప్పును కలిగిస్తూ.. మనుషుల ఉపాధిని హరించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ద్రుష్టి సారిస్తూ.. భద్రత, గోప్యత ప్రమాణాలను పాటించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (EO) పైన సంతకం చేసాను అని వెల్లడించారు.