Leading News Portal in Telugu

Viral News: బట్టలు లేకుండా రోడ్డుపై వ్యక్తి.. పోలీసులపైనే దాడి


Viral News: బట్టలు లేకుండా రోడ్డుపై వ్యక్తి.. పోలీసులపైనే దాడి

Viral news: సోషల్ మీడియా వాడుకలో కి వచ్చాక రోజుకో వింత దర్శనం ఇస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగిన క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది . అలాంటి వింత ఘటన తాజాగా లాస్ వెగాస్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. మంగళవారం రాత్రి లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ పోలీసులకు బ్లూ డైమండ్ రోడ్, బఫెలో డ్రైవ్ సమీపంలో ఒక వ్యక్తి నగ్నంగా తిరుగుతున్నాడని పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి ఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని గుర్తించారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసు అధికారి విచారించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Read also:Kunamneni: మాట మారిస్తే సరైంది కాదు… కాంగ్రెస్ తో పొత్తు ఇవాళ, రేపు ఫైనల్ అవుతుంది

ఈ నేపథ్యంలో నగ్నంగా ఉన్న వ్యక్తి పోలీసు అధికారికి ఎదురు తిరిగి అధికారి పైన దాడి చేసాడు. అనంతరం పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కొంత దూరం ప్రయాణించాడు. అనంతరం ఆ పెట్రోలింగ్ వాహనంతో మరో కారును ఢీ కొట్టాడు. అయితే ఎవరో ఓ వ్యక్తి ఆ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నగ్నంగా ఉన్న వ్యక్తి పోలీసు అధికారి కొట్టడం అలానే నెట్టడం స్పష్టంగా గమనించవచ్చు. ప్రస్తతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చూసిన వారంతా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. కొందరు హాస్యాస్పద ఎమోజిల ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.