Leading News Portal in Telugu

Plane-Car Accident: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్!



Us Plane Car Accident

Small Plane crashes into car in America: అగ్ర రాజ్యం అమెరికాలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన టెక్సాస్‌ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులో ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో ఓ సింగిల్-ఇంజిన్ లాంకైర్ Iv-P ప్రాప్‌జెట్‌ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్‌ అయ్యింది. అయితే దానిని పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. విమానం రన్‌వేపై చివరి వరకు వచ్చినా.. ఆగలేదు. బుల్లి విమానం ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని ఈస్ట్‌బౌండ్ వర్జీనియా పార్క్‌వేపై వెళుతున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టింది. వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని.. పైలట్‌, కారు డ్రైవర్‌ను రక్షించాయి.

Also Read: Tiger 3 Review: సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

బుల్లి విమానం నెమ్మదిగానే కారును ఢీ కొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటల పాటు మూసివేశారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ అధికారులు దర్యాప్తు ఆరంబించారు. అమెరికాలో గత కొన్నేళ్లుగా చిన్న విమానాల ప్రమాదాల సంఖ్య భారీగా ఉన్నాయి. 2019లో 988 ప్రమాదాలు జరగ్గా.. 307 మంది మృతి చెందారు. 2021లో 939 ప్రమాదాలు జరగగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు.