Leading News Portal in Telugu

America: బైడెన్ మనవరాలికి భద్రతా లోపం.. కాల్పులు జరిపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు



Biden

America: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నవోమీ బిడెన్ భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. ముగ్గురు దుండగులు నవోమి ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో కారుపై దాడి చేయడాన్ని చూసి.. నవోమి భద్రత కోసం మోహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.

Read Also: Maharashtra: మహారాష్ట్రలో భక్తులు, పూజారిపై ముస్లింలు దాడి.. కారణమేంటంటే..?

నివేదికల ప్రకారం.. నవోమి కారుపై దాడి జరిగినప్పుడు ఆమె తన సెక్యూరిటీతో జార్జ్‌టౌన్‌లో ఉన్నారు. నవోమి కారు ఆగి ఉండటం చూసిన ఆగంతకులు.. అద్దాలు పగులగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే వారిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. అయితే అంతకుముందు.. ప్రెసిడెంట్ బిడెన్ మనవరాలు నవోమి భద్రత కోసం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను నియమించారు.

Read Also: Akkineni Naga Chaitanya: అన్ని అయిపోయాయి.. ఇక దీని మీదనే ఆశలన్నీ.. ఏం చేస్తావో ఏమో.. ?