Leading News Portal in Telugu

Israel-Hamas War: గాజాపై పట్టు సాధిస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు స్వాధీనం..



Gaza

Israel-Hamas War: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం పట్టు సాధిస్తోంది. హమాస్ వ్యవస్థను నేలమట్టం చేసేందుకు ఉత్తర గాజాను ముఖ్యగా గాజా నగరాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చుట్టుముట్టింది. గాజాలో భూతల దాడుల ద్వారా హమాస్ ఉగ్రస్థావరాలను నేలకూల్చుతోంది. ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదులకు, వారి టన్నెట్ వ్యవస్థకు రక్షణగా ఉన్న ఇజ్రాయిల్ లోని పలు ఆస్పత్రులను ఐడీఎఫ్ చుట్టుముట్టింది. ముఖ్యంగా అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే గాజా నగరంలోని హమాస్ పార్లమెంట్, ఇతర ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం తెలిపింది. హమాస్ పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు, హమాస్ పోలీస్ ప్రధాన కార్యాలయం, ఆయుధాల ఉత్పత్తికి సంబంధించిన భవనాలను స్వాధీనం చేసుకుంది.

Read Also: Canada: దీపావళి వేడుకల్లో ఖలిస్తానీ నినాదాలు.. హిందువులు, ఖలిస్తానీల మధ్య ఘర్షణ

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు వేల కొద్దీ రాకెట్లను ప్రయోగించి, ఇజ్రాయిల్‌లోకి చొరబడి అక్కడి ప్రజల్ని దారుణంగా చంపేశారు. ఈ దాడుల్లో 1400 మంది చనిపోగా.. 240 మందిని బందీలుగా పట్టుకున్న హమాస్ తీవ్రవాదులు వారిని గాజాలోని భూగర్భ సొరంగాల్లో దాచినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ భీకరదాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 11 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. హమాస్ తీవ్రవాదుల్ని పూర్తిగా హతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. గాజా ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని సురక్షితమైన దక్షిణ ప్రాంతాల్లోకి వెళ్లాల్సిందిగా చెప్పింది. హమాస్ ఉగ్రవాదులు సాధారణ ప్రజల్ని మానవకవచాలుగా వాడుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.