Leading News Portal in Telugu

Israel-Hamas War: 19 ఏళ్ల మహిళా సైనికురాలిని చంపిన హమాస్ ఉగ్రవాదులు..


Israel-Hamas War: 19 ఏళ్ల మహిళా సైనికురాలిని చంపిన హమాస్ ఉగ్రవాదులు..

Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1400 మందిని హతమర్చాడమే కాకుండా, ఇజ్రాయిల్ లోని 240 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి బందీలుగా పట్టుకెళ్లింది. అయితే ఇందులో ఇప్పటికే కొంతమందిని చంపేసినట్లు తెలుస్తోంది. తాజాగా 19 ఏళ్ల ఇజ్రాయిల్ మహిళా సైనికురాలు హత్యకు గురైనట్లు డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. గాజా స్ట్రిప్ లోని షిఫా హాప్ హాస్పిటల్ పక్కన మహిళా సైనికులురాలు కార్పొరల్ నోవా మార్సియానో మృతదేహాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది.

గాజాలోని ఆస్పత్రులు, పాఠశాలలను హమాస్ ఉగ్రవాదులు స్థావరాలుగా ఉపయోగించుకుంటున్నాయి. వీటి కింద టన్నెల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులోనే ఆయుధాలు, హమాస్ కమాండ్ సెంటర్‌ ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా వీటిలో ఆయుధాలను, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను ఇజ్రాయిల్ సైన్యం బయటపెట్టింది. వీటికి సంబంధించిన అనేక దృశ్యాలను బహిర్గతం చేసింది.

‘‘హమాస్ ఉగ్రవాదులు 19 ఏళ్ల సీపీఎల్ నోవా మార్సియానోను అక్టోబర్ 7న అపహరించి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని గాజాలోని షిఫా ఆస్పత్రిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఐడీఎఫ్ దళాలు ఆమె మృతదేహాన్ని కనుగొన్నాయి. ఆమె కుటుంబానికి ఐడీఎఫ్ సానుభూతి తెలియజేస్తుంది.’’ అని ఐడీఎఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ రోజు తెల్లవారుజామున గాజాలోని ఆస్పత్రి పక్కన మరొక 65 ఏళ్ల ఐదుగురు పిల్లల తల్లి హత్యకు గురైనట్లు ఐడీఎఫ్ తెలిపింది. 65 ఏళ్ల యోహుదిత్ వీస్ గాజాలోని హమాస్ ఉగ్రవాదుల చేతివలో హత్యకు గురైనట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. అక్టోబర్ 7న ఆమె భర్తను హతమార్చిన హమాస్, అదే రోజున ఆమెను కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లింది.

గాజాలోని మూడు అతిపెద్ద ఆస్పత్రులు అయిన అల్ షిఫా, రాంటిసి, అల్-ఖుడ్స్ ఆస్పతుల కింద హమాస్ టన్నెల్ వ్యవస్థతో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఇజ్రాయిల్ బలగాలు కనుగొన్నాయి. అల్ షిఫా ఆస్పత్రి కంప్యూటర్లలో బందీలకు చెందిన ఫుటేజీని కనుగొన్నట్లు వెల్లడించింది.