
ప్రస్తుతం పెరిగిన సాంకేతికత కారణంగా స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది. ఇక ఆన్లైన్ అకౌంట్ ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తినే తిండి, తాగే నీళ్లు, వేసుకునే దుస్తులు, నిత్యావసర వస్తువులు అన్నీ ఆన్లైన్ లోనే. ఇక బ్యాంకు లావాదేవీలు కూడా ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. కనుక మనలో చాలా మంది.. వివిధ రకాల అకౌంట్లకు పాస్‌వర్డ్ ను పెట్టుకుంటాము. అయితే ప్రపంచవ్యప్తంగా దాదాపు లక్షల మంది ఒకే పాస్వర్డ్ ను కలిగి ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా నోర్డ్‌పాస్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ పాస్‌వర్డ్ పైన అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయం తెలిసింది. అదే మనలో చాల మంది ఒకే పాస్వర్డ్ ను ఉపయోగిస్తున్నారు.
Read also:Uttam Kumar Reddy: నేను ఆ మాటలు చెప్పలే.. ఫిర్యాదు చేయలే..
అదే ‘123456’ అనే పాస్‌వర్డ్ ను ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో దాదాపు 45 లక్షల మంది ఈ పాస్‌వర్డ్ ను ఉపయోగిస్తున్నారు. ఇక అడ్మిన్’, ‘12345678’ అనే పాస్‌వర్డ్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా కేవలం మన దేశంలోనే 3.6 లక్షల అకౌంట్లు ‘123456’ కలిగి ఉండగా , 1.2 లక్షల అకౌంట్లు ‘అడ్మిన్’ అనే పాస్‌వర్డ్‌ను కలిగి ఉన్నట్లు నోర్డ్‌పాస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇంత బలహీన పాస్‌వర్డ్‌లను ఉపయోగించ వద్దని.. కఠిన పాస్‌వర్డ్ ఉపయోగించమని.. లేకపోతే అకౌంట్లు తేలికగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతాయని హెచ్చరించింది.