Leading News Portal in Telugu

Ship Hijack: భారత్ వస్తున్న నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..



Israel

Ship Hijack: టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్‌గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే విషయం ప్రస్తుతానికి తెలియదు. హైజాక్ విషయాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది.

దక్షిణ ఎర్ర సముద్రంలో యెమెన్ సమీపంలోని హౌతీలు ఒక కార్గో షిప్‌ను హైజాక్ చేశారు. ఇది ప్రపంచ పరిణామాల్లోఇది చాలా ఘోరమైన సంఘటన. ఓడ టర్కీ నుంచి భారతదేశానికి వెళ్లే మార్గంలో ఉంది. వివిధ దేశాలకు చెందిన సిబ్బంది నౌకలో ఉన్నారు. ఇజ్రాయిలీలు ఇందులో లేరు, ఇది ఇజ్రాయిల్ నౌక కాదు’’ అని ట్వీట్ లో పేర్కొంది.

Read Also: Extra Marital Affairs: ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు.. ఒక చోట భార్య, మరోచోట భర్త హత్య..

అంతర్జాతీయ నౌకపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేయడాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నౌక బ్రిటీష్ కంపెనీకి చెందిందని, జపాన్ సంస్థచే నిర్వహిస్తున్నట్లు, ఈ నౌకను ఇరాన్ మార్గదర్శకత్వంతో యెమెన్ హౌతీలు హైజాక్ చేసిందని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ నౌక బ్రిటీష్ కంపెనీ కింద రిజిస్టర్ చేయబడిందని, దీంట్లో ఇజ్రాయిల్ వ్యాపారవేత్త అబ్రహం ఉంగార్‌కి పాక్షికంగా యాజమాన్యం ఉందని, హైజాక్ సమయంలో ఈ నౌకను జపాన్ కంపెనీకి లీజుకు ఇచ్చారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్‌కి సపోర్ట్ చేస్తోంది. ఇజ్రాయిల్ తో సంబంధం ఉన్న నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడులు ఆగిపోయే వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని ఇటీవల హౌతీలు ప్రకటన చేశారు.