
United Nations: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఆకస్మికంగా ఇజ్రాయిల్ పైన దాడి చేసి విచక్షణారహిత్యంగా వందల మందిని చంపింది. ఈ నేపథ్యంలో హమాస్ ను మట్టుబెడతామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టుగానే హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజా పైన విరుచుకు పడుతుంది ఇజ్రాయిల్. యుద్ధం ప్రారంభమై నెల దాటినా నేటికీ యుద్ధ కీలలు ఎగసి పడుతున్నాయి. సోమవారం అంటే నేటికీ గాజాలో 4,506 మంది పిల్లలు అలానే 3,027 మంది మహిళలతో సహా 11,078 మంది మరణించారు. కాగా సుమారు 1,500 మంది చిన్నారులతో సహా దాదాపు 2,700 మంది తప్పిపోయారు. వారాంత శిథిలాల కింద చిక్కుకుపోయి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అలానే 27,490 మంది పాలస్తీనియన్లు గాయపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Read also:Pat Cummins: మరోసారి ప్రేమలో పడ్డా.. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోను!
ఈ నేపథ్యంలో రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతుంది. ఈ తరుణంలో మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మరోసారి గాజాలో ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల విరమణ కోసం తన పిలుపునిచ్చారు. ఇప్పటికే చిన్నపిల్లలు, మహిళలతో సహా 11 వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారని.. గాజాలో మానవతావాద ప్రతిపాదన కింద ఈ యుద్ధం ఇంతటితో విరమించుకోవాలని.. ప్రాణనష్టం పెరగడం, పాఠశాలలు , ఆశ్రయాలు అన్నీ నాశనమై గాజా పరిస్థితి దయనీయంగా ఉందని.. ఈ నేపథ్యంలో తక్షణ మానవతావాద ప్రతిపాదన కింద కాల్పుల విరమణ కోసం నేను నా పిలుపును పునరుద్ఘాటిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.