Leading News Portal in Telugu

Fire in Parliament: అల్బేనియా పార్లమెంటులో బాంబు పేల్చిన ప్రతిపక్షం..



Untitled 14

Albania: సాధారణంగా అధికారక పక్షాన్ని ప్రతి పక్షాలు ప్రశ్నింస్తాయి. అలానే కొన్నిసార్లు ఆరోపణలు కూడా చేస్తాయి. అధికార పక్షానికి, ప్రతి పక్షానికి మధ్య వాడి వేడి వాదనలు కూడా జరుగుతాయి. ఇది ఎక్కడైనా సహజమే. అయితే అధికార పక్షంతో వాదన పెట్టుకుని పార్లమెంటు లో పొగ బాంబును పేల్చి మంటలు సృష్టించారు ప్రతి పక్షం సభ్యులు. ఈ ఘటన అల్బేనియాలో జరిగింది. వివరాల లోకి వెళ్తే..అల్బేనియా పార్లమెంటులో సోమవారం మంటలు చెలరేగాయి. దీనితో సభను 5 నిమిషాల లోపే ముగించారు. సోమవారం వచ్చే ఏడాది బడ్జెట్‌పైన ఓటింగ్‌ నిర్వహించాలని సమావేశం ఏర్పాటు చేసింది అధికార పక్షం.. ఈ నేపధ్యంలో సభకు విచ్చేసిన ప్రధానమంత్రి ఎది రామ తన కుర్చీలో కూర్చున్నారు.

Read also:Venkatesh Iyer Engagement: టీమిండియా క్రికెట‌ర్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ వైరల్!

వెంటనే డెమోక్రాటిక్‌ ఎంపీలు వాదనకు దిగారు. ఇరు పక్షాల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి . ఈ నేపథ్యంలో ప్రతి పక్ష సభ్యులు బీభత్సం సృష్టించారు. పార్లమెంటులో పొగబాంబు పేల్చారు. దీనితో పార్లమెంటులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పార్లమెంటులో భయంకర వాతావరణం నెలకొంది. పార్లమెంటు లోని హాల్ లో కుర్చీలను ఒక దాని పైన ఒకటి కుప్పగా పేర్చి వాటిని తగలబెట్టారు. అలానే ప్రతిపక్షంగా ఉన్న డెమోక్రాటిక్‌ సభ్యులు అధికార పక్షంను గాయపరిచేందుకు వస్తుండగా భద్రత సిబ్బంది వాళ్ళను అడ్డుకున్నారు. ఒక్కసారిగా పార్లమెంటులో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. దీనితో అధికార వామపక్ష సోషలిస్టులు అత్యవసరంగా ఓటింగ్‌ పూర్తి చేసారు. అనంతరం కేవలం 5 నిమిషాల వయ్వధిలో సభను ముగించారు.