
Monkeypox: గతేడాది ప్రపంచాన్ని కుదిపేసిన మంకీపాక్స్ వ్యాధి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆఫ్రికా దేశం డెమెక్రాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ లైంగికంగా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ దేశంలో అతిపెద్ద వ్యాప్తి నమోదైంది. ఈ దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. బెల్జియం దేశానికి చెందిన నివాసిమార్చిలో కాంగోకు వెళ్లారని, కొద్ది సేపటికే మంకీపాక్స్ పాజిటివ్ అని తేలిందని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది.
తొలుత వ్యాధి సోకిన వ్యక్తి మరో పురుషుడితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు, అతను స్వలింగ సంపర్కుల కోసం అనేక ప్రాంతాలకు వెళ్లినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అతని ద్వారా మరో ఐదుగురు ఈ వ్యాధి బారిన పడినట్లు చెప్పింది. ఆఫ్రికాలో మంకీపాక్స్ సంక్రమణకు ఇది ఖచ్చితమైన రుజువని నైజీరియన్ వైరాలజిస్ట్ ఓయోవాలే టోమోరి తెలిపారు.
Read Also: No Non-veg Day: రేపు యూపీలో “నో నాన్ వెజ్”.. అన్ని మాంసం దుకాణాలు బంద్..
మంకీపాక్స్ గతేడాదిలో పలు యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాలో విభృంభించింది. ముఖ్యంగా స్వలింగ సంపర్కుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఇది కొన్ని దశాబ్ధాలుగా ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేది. ఇన్ఫెక్షన్కి గురైన ఎలుకల నుంచి ఈ వ్యాధి మానవులకు, ఆ తర్వాత మానవుల నుంచి మానవులకు వ్యాపించింది. దీంతో గతేడాది యూరోపియన్ దేశాలతో పాటు మొత్తంగా 100కు పైగా దేశాల్లో ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ దీన్ని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇప్పటివరకు 91 వేల కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది కాంగోలో 12,500 మందికి పైగా మంకీపాక్స్ బారిన పడితే 580 మంది మరణించారు. 2020లో నమోదైన మరణాల కన్నా ఇవి రెట్టింపుగా ఉన్నాయి. ఇది కాంగోలో ఇప్పటి వరకు వ్యాపించని అతిపెద్ద వ్యాప్తిగా నమోదైంది. వైరస్ బారిన వ్యక్తులు అండర్ గ్రౌండ్ లో ఉంటే వ్యాధిని అరికట్టడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంకీపాక్స్ వ్యాధి సోకితే ఒంటిపై దద్దులు, చలి, ముఖం, జననేంద్రియాలపై గాయాలు కనిపిస్తాయి. చాలా మంది వ్యక్తుల్లో ఈ లక్షణాలు కొన్ని వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే వ్యాధి సీరియస్ అవుతుంది. అయితే దీనికి ప్రస్తుతానికి టీకా లేదు.