Leading News Portal in Telugu

Honour killing: పాకిస్తాన్‌లో పరువు హత్య.. అబ్బాయితో డ్యాన్ చేసిందని అమ్మాయిని హతం చేసిన కుటుంబం..


Honour killing: పాకిస్తాన్‌లో పరువు హత్య.. అబ్బాయితో డ్యాన్ చేసిందని అమ్మాయిని హతం చేసిన కుటుంబం..

Honour killing: ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పడిన పాకిస్తాన్‌లో కొందరు మతఛాందసవాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. దీంతో అక్కడ అమ్మాయిలు, మహిళల స్వేచ్ఛకు పరిమితులు ఉంటున్నాయి. ఇదే కాకుండా పరువు హత్యల విషయంలో పాకిస్తాన్ టాప్ పొజిషన్‌లో ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ప్రేమించుకుంటున్న అక్కడ అమ్మాయిలను సొంత బంధువులు, కుటుంబ సభ్యులే క్రూరంగా హత్య చేస్తున్నారు.

తాజాగా ఓ అమ్మాయి, అబ్బాయితో డ్యాన్స్ చేసిందందుకు అత్యంత దారుణంగా హత్యకు గురైంది. సొంత కుటుంబమే ఆమెను చంపేసింది. పాకిస్తాన్ లోని కోహిస్తాన్ ప్రాంతంలో 18 ఏళ్ల అమ్మాయిని చంపేశారు. అబ్బాయితో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతోనే అమ్మాయిని హత్య చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో అబ్బాయి హత్యను నిరోధించగలిగారు.

స్థానిక మతపెద్దల ఆదేశాలతోనే అమ్మాయిని హత్య చేసినట్లు సమాచారం. అదే వీడియోలో కనిపించిన మరో అమ్మాయిని కూడా హత్య చేయాలని జిర్గా ఆదేశించింది. ఆ అమ్మాయి హత్య జరిగే లోపే పోలీసులు రక్షించారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కొన్ని హక్కుల సంఘాలు పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న క్రమంలో అమ్మాయి హత్య పాక్ వ్యాప్తంగా దుమారం రేపింది.

జిల్లా పోలీస్ అధికారి ముక్తియార్ తనోలి మాట్లాడుతూ.. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలిక కుటుంబీకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెతో డ్యాన్స్ చేసిన బాలుడు అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ వీడియోలో ఉన్న మరో యువతికి ప్రాణహాని లేదని వారితో వెళ్లాలని కోరుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

2011లో కుటుంబ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తికి చప్పట్లు కొట్టిన వీడియో వైరల్ కావడంతో జిర్గా మరణశిక్ష విధించడంతో ఐదుగురు మహిళల్ని హత్య చేశారు. ఈ ఘటన పాకిస్తాన్ లో సంచలనంగా మారింది. ముగ్గురు అన్నాదమ్ముల్ని కూడా హత్య చేశారు. తన ప్రాణాలకు అపాయం ఉందని 2012లో చెప్పిన మరో సోదరుడు అఫ్జల్ కోహిస్తానీని 2019లో అబోటాబాద్ లో కాల్చి చంపారు. \