Leading News Portal in Telugu

America: హైవేపై వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం


America: హైవేపై వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం

America: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?. అదే వెరైటీ. కాగా, ఈ వింత ఘటన మిన్నియాపాలిస్‌ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మంగళవారం (28 నవంబర్ 2023) అమెరికా నగరంలోని మిన్నియాపాలిస్‌లోని హైవేపై విమానం కూలిపోయింది. ఈ క్రమంలో కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్‌, పైలట్‌కు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మిన్నెసోటాలోని బ్రూక్లిన్ పార్క్‌లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసివేశారు.