Leading News Portal in Telugu

Wedding Bride Cake: రూ. 8 కోట్ల కేక్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే


Wedding Bride Cake: రూ. 8 కోట్ల కేక్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

వేడుక ఏదైనా.. అక్కడ కేక్‌కు మాత్రం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఒకప్పుడు బర్త్‌డే అంటనే కేక్ కట్ చేసేవారు. కానీ ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా కేక్ కట్ చేయాల్సిందే. వేడుకను బట్టి స్పెషల్‌గా కేక్‌ను తయారు చేయించుకుంటున్నారు. ఇందుకోసం వేలల్లోనే ఖర్చు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ స్పెషల్ కేక్ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. వధువు ఆకారంలో ఉన్న ఈ కేక్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరిదైన కేక్‌గా రికార్డుకు ఎక్కింది. అయితే దీని ప్రత్యేకతలు, ధర తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు అవాక్కవ్వాల్సిందే. దాదాపు రూ. 8 కోట్లు ఖర్చు చేసి మరి ఈ భారీ కేక్‌ను తయారట. ఇది వింటే ఒక్క కేక్‌కే అంత ఖర్చు చేయడమేంటి, అసలు 8 కోట్ల కేక్ ఉంటుందా? అని ఆశ్చర్యం వేస్తుంది కదా. అయితే దాని స్పెషాలిటీ ఏంటో మీరు తెలుసుకోవాల్సిందే.

ప్రత్యేకతలు ఏంటంటే:
దుబాయ్‌కి చెందిన డెబ్బీ వింగ్‌హామ్‌ అనే టీం తయారు చేసి ఈ కేక్‌ను వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచడంతో వైరల్‌గ మారింది. అచ్చంగా దుబాయ్‌ అరభ్ వధువు ఆకారంలో ఏకంగా 182 సెంటీమీటర్ల ఎత్తు, 120 కిలోల బరువుతో ఈ కేక్ రూపొందించారు. ఇది తయారు చేయడానికి పది రోజుల సమయం పట్టిందట. ఈ కేక్‌ తయారీకి 1000 కోడిగుడ్లు, 20 కిలోల చాక్లెట్‌ను ఉపయోగించారు. ఇక్కడితో ఆగిపోకుండ 50 కిలోల లాసీ మిఠాయిను ఉపయోగించారు. అలాగే ఇందులో తినదగిన 3 క్యారెట్‌ వజ్రాలు, ముత్యాలను వాడారు. ఇందులో ఉంచిన వజ్రాలు విలువ లక్షల్లో ఉంటుంది. ఇక రైస్‌ క్రిస్పీ, మోడలింగ్ చాక్లెట్‌తో పాటు 20 కిలోల బెల్జియన్‌ చాక్లెట్‌ను ఉపయోగించారు.

వాటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక 50 కిలోల కేక్‌ ఫాండెంట్‌, 5వేల హ్యాండ్‌మేడ్ ఫాండెంట్‌ పువ్వులతో వెడ్డింగ్‌ గౌన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆ ఫ్లవర్స్‌ను మొత్తం స్వీట్‌తో తయారు చేశారు. 5వేలకిపై గా పూలు, 10000 ముత్యాలు, 110 పౌండ్స్‌తో కేక్‌ ఫౌండేషన్‌ను రూపొందించారు. ఇక 2లక్షల డాలర్ల విలువైన డైమండ్స్‌ను కేక్‌లో పొందుపరిచారు. అలా మొత్తంగా ఈ కేక్ ధర రూ. 8 కోట్ల అయ్యింది. దీనిని ఇటీవల దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఎగ్జిబిషన్‌లో ఉంచగా.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన, ఖరిదైన కేక్‌గా రికార్టుకు ఎక్కింది.