
గర్భం దాల్చిన ఓ మహిళను గురువారం ఉదయం లాడ్‌లో కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఈ ఘటనలో ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు కూడా మరణించింది. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఆమె పుట్టబోయే బిడ్డను రక్షించే ప్రయత్నంలో అత్యవసర సిజేరియన్ ఆపరేషన్ చేశారు. అప్పటికే వారిద్దరూ చనిపోయారని వైద్యులు తెలిపారు. ఈ హత్య ఘటనపై మహిళ తండ్రి, సోదరుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఈ హత్య ఘటనకు సంబంధించి వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో.. తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి సమీపంలోని కిండర్ గార్టెన్‌కు వెళుతుండగా, దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు కనిపిస్తుంది. దుండుగుడు ఆ మహిళపై పలుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో భయంతో తన ఇద్దరు చిన్న పిల్లలు, ఇతర బాటసారులు పారిపోయారు. మరోవైపు.. మహిళ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మొండెంపై చాలాసార్లు కత్తిపోట్లకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై.. నమాత్ మహిళా హక్కుల సంఘం అధ్యక్షురాలు హగిత్ పీర్ మాట్లాడుతూ.. కత్తిపోట్లను “గృహ తీవ్రవాదం, “స్త్రీ, పిండం డబుల్ హత్య” అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పోలీసులు త్వరలో నిందితుడిని పట్టుకుంటారని, ఇజ్రాయెల్ ఆ మహిళకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు పీర్ తెలిపారు. కాగా.. హింస-వ్యతిరేక అబ్రహం ఇనిషియేటివ్స్ గ్రూప్ ప్రకారం.. ఈ మహిళ మరణంతో సంవత్సరం ప్రారంభం నుండి అరబ్ సమాజంలో హింస కారణంగా మరణించిన వారి సంఖ్య 222కి చేరుకుంది.