Leading News Portal in Telugu

Old Woman: కవలలకు జన్మనిచ్చిన70 ఏళ్ల వృద్ధురాలు


Old Woman: కవలలకు జన్మనిచ్చిన70 ఏళ్ల వృద్ధురాలు

70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు తల్లయింది. అది కూడా కవలకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. దీంతో అంత్యంత పెద్ద వయసులో తల్లయినా వారిలో ఆమె ఒకరుగా నిలిచింది. వివరాలు.. తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా పట్టనానికి చెందిన సఫీనా నముక్వాయా IVF(సంతానోత్పత్తి పద్దతి) ద్వారా తల్లయినట్టు కంపాలలోని ఇంటర్నేషనల్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ అనే ఉమెన్స్ హాస్పిటల్ తెలిపింది.

ఈ మేరకు ఉమెన్స్ హాస్పిటల్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ షేర్ చేసింది. ‘ఐవీఎఫ్ ద్వారా 70 ఏళ్ల సఫీనా గర్భం దాల్చింది. రీసెంట్‌గా ఆమె సిజెరియన్ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మిచ్చింది. వారి ఒక పాప, ఒక బాబు. తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇది నిజంగా ఓ అద్భుతం అనే చెప్పాలి. గత మూడేళ్లలో నముక్వాయాకు ఇది రెండో డెలివరీ. 2020లో కూడా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది’ అని హాస్పిటల్ తన పోస్ట్‌లో పేర్కొంది.