Leading News Portal in Telugu

MRI Machine: లోడ్ చేసిన తుపాకీతో ఎంఆర్ఐ మిషన్‌లోకి మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?.


MRI Machine: లోడ్ చేసిన తుపాకీతో ఎంఆర్ఐ మిషన్‌లోకి మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?.

MRI Machine: అమెరికాలో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. జూన్ నెలలో ఒక మహిళ MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజినింగ్) మెషీన్‌లోకి లోడ్ చేసిన తుపాకీతో వెళ్లింది. ఈ పరిణామం ఆమె ప్రాణాలను మీదికి తెచ్చింది. లోడ్ చేయబడిన తుపాకీ పేలడంతో ఆమె వెనక భాగంలో గాయమైంది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం..57 ఏళ్ల మహిళ ఈ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది.

ఎంఐఆర్ మిషన్స్ బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకనే డాక్టర్లు అయస్కాంతాలకు ఆకర్షితమయ్యే వస్తువులను తీసుకుని ఎంఆర్ఐ మిషన్‌లోకి వెళ్లవద్దని హెచ్చరిస్తుంటారు. ఎంఆర్ఐ స్కాన్ తీసేటప్పుడు రోగి వద్ద అలాంటి వస్తువులు లేకుండా వైద్యులు జాగ్రత్త పడుతుంటారు. అయితే సదరు మహిళ వద్ద ఉన్న ఎయిర్ గన్, ఎంఆర్ఐ మిషన్ అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనైనప్పుడు, దాని ట్రిగ్గర్ అనుకోకుండా ట్రిప్ అయింది. వెంటనే గన్ పేలడంతో ఆమె వెనక భాగంలో గాయాలయ్యాయి.

ఎంఆర్ఐ గదిలోకి పేషెంట్ హ్యాండ్ గన్ దాచిపెట్టి తీసుకువచ్చింది. మిషన్ బోర్‌లోకి ప్రవేశించే సమయంలో చేతిలోని తుపాకీ అయస్కాంతానికి ఆకర్షితమై, ఒక రౌండ్ కాల్పులు జరిగాయి. రోగి పిరుదులపై తుపాకీ గాయమైనట్లు ఎఫ్‌డీఏ చెప్పింది. ఈ ఘటనలో రోగి సబ్కటానియస్ కణజాలం దెబ్బతింది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది. అయితే సదరు మహిళ ఎంఆర్ఐ గదిలోకి ఆయుధాన్ని ఎలా తీసుకురాగలిగిందనేది అస్పష్టంగా ఉంది.

MRI యంత్రాలు మానవ శరీరం లోపలి భాగాలను చిత్రీకరించడానికి అత్యంత శక్తివంతమైన అయస్కాంతాల ద్వారా మాగ్నెటిక్ ఫీల్డ్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాంటి సమయాన్ని పెషెంట్స్ అయస్కాంతాలకు ఆకర్షితమయ్యే వస్తువులను దగ్గరగా ఉంచుకోవద్దు. ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా అరుదు. గతంలో ఇలాగే యూఎస్ ఆస్పత్రిలో ఓ మహిళకు ఎంఆర్ఐ మిషన్ వల్ల తీవ్రగాయాలయ్యాయి. బ్రెజిల్‌లో ఏకంగా ఓ వ్యక్తి దగ్గర ఉన్న గన్ ఫైర్ అయి బుల్లెట్ గాయాలతో మరణించాడు.