Medical Miracle: వైద్యశాస్త్రంలోనే ఈ ఘటన అద్భుతమని చెప్పాలి. వైద్యపరంగా మరణించిన ఓ మహిళ, 24 నిమిషాల తర్వాత బతికింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన సదరు మహిళ తన అనుభవాలను పంచుకుంది. రచయిత్రి లారెన్ కెనడే గుండో కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించారు. దాదాపుగా అరగంట తర్వాత మళ్లీ ఆమెకు పునరుజ్జీవనం లభించింది. మెలుకువలోకి వచ్చిన తర్వాత గత వారం ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ప్రస్తుతం రెడ్డిట్‌లో జరుగుతున్న ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో కెనడే ఇదంతా వెల్లడించారు.
గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత తనను వెంటనే ఆస్పత్రికి తరలించారని, స్పృహలోకి రాకముందు రెండు రోజులు కోమాలోకి ఉన్నానని సదరు మహిళ చెప్పింది. గుండె ఆగిపోయిన తర్వాత తన భర్త సీపీఆర్ చెసినట్లు తెలిపింది. ఇదంతా గత ఫిబ్రవరిలో తన ఇంట్లో జరిగినట్లు కెనడే చెప్పారు. గుండె ఆగిపోవడంతో, తన భర్త 911కి కాల్ చేసి సీపీఆర్ చేయడం ప్రారంభించారని, తానకు మళ్లీ ప్రాణం రావడానికి 24 నిమిషాలు పట్టిందని చెప్పారు. 9 రోజులు ఐసీయూలో చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. ఎంఆర్ఐ స్కాన్లలో ఆమె మెదడులో ఎలాంటి డ్యామేజీ లేదని వైద్యులు నిర్ధారించారు.
వైద్యపరంగా కెనడే ‘లాజరస్ ఎఫెక్ట్’ లేదా స్వీయ పునరుజ్జీవనాన్ని అనుభవించింది. ఇలాంటి అరుదైన విషయం రోగి గుండె ఆగిపోయన సందర్భంలో అకాస్మత్తుగా మళ్లీ జీవం పోసుకోవడం సంభవిస్తుంది. ఇది వాస్తవంగా చనిపోకుండానే, చనిపోయిన స్థితిని నుంచి తిరిగి వచ్చినట్లు ఉంటుంది. అయితే ఇలాంటి కేసుల్లో మళ్లీ బతికిన వారు ఎక్కువ కాలం జీవించు. 1982-2018 మధ్య నమోదైన 65 కేసుల్లో 18 మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారు.