Leading News Portal in Telugu

Putin: అప్పుడే శాంతి నెలకొంటుంది.. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ వ్యాఖ్యలు..


Putin: అప్పుడే శాంతి నెలకొంటుంది.. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ వ్యాఖ్యలు..

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా రోజుల తర్వాత మీడియాలో, ప్రజలనుద్దేశించి గురువారం మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పుతిన్ 2030 వరకు అధ్యక్షుడిగా ఉండేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు. మార్చిలో జరగబోయే రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.

గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించింది. మన లక్ష్యాలు సాధించినప్పుడే శాంతి నెలకొంటుందని పుతిన్ స్పష్టం చేశారు. మన లక్ష్యాలు మారవమని, ఉక్రెయిన్ ప్రాంతాన్ని డీ-నాజిఫికేషన్, డీ-మిలిటరైజేషన్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందని పుతిన్ చెప్పారు. రష్యా జాతీయ టెలివిజన్‌లో నాలుగు గంటల పాటు పుతిన్ కనిపించారు. రెండేళ్లుగా కొనసాగుతున్న పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ ఒంటరితనం రష్యా ఆర్థిక వ్యవస్థను, నైతికతను దెబ్బతీయలేదని పుతిన్ అన్నారు. మనం ఆత్మవిశ్వాసాన్ని అనుభవించడమే కాదు, ముందుకు సాగడానికి సరిపోతుందని అన్నారు.

పుతిన్ కార్యక్రమం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది. మరోవైపు రష్యా ప్రయోగించిన 42 డోన్లలో ఒకటి మినహా అన్నింటిని కూల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు పుతిన్ సమావేశానికి సమాంతరంగా బ్రస్సెల్స్ వేదికగా ఈయూ సమావేశం జరిగింది. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఉక్రెయిన్ సభ్యత్వానికి హంగేరియన్ ప్రధాని విక్టర్ ఓర్బన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇతను పుతిన్ఋకి మిత్రుడిగా ఉన్నారు. ఉక్రెయిన్ కూటమిలో చేరుకునేందుకు మెరిట్ ఆధారిత ప్రమాణాలను అందుకోలేదని విక్టర్ చెప్పారు.