Leading News Portal in Telugu

Maldives: నీటి సర్వేపై భారత్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం.. మాల్దీవుల ప్రకటన..


Maldives: నీటి సర్వేపై భారత్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం.. మాల్దీవుల ప్రకటన..

Maldives: మాల్దీవుల్లో చైనా అనుకూల వ్యక్తి మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు కాగానే.. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాడు. ఇప్పటికే ద్వీపదేశంలో ఉన్న భారత సైనికులను వెళ్లాల్సిందిగా కోరాడు. ఇప్పుడు మరో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. భారత్‌తో కలిసి మాల్దీవులు చేస్తున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ఆ దేశం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాల్దీవుల పబ్లిక్ పాలసీ అండర్ సెక్రటరీ మహ్మద్ ఫిరుజుల్ మాట్లాడుతూ.. ‘హఫ్తా-14’ రోడ్ మ్యాప్‌లో భాగంగా దేశ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే ఇతర దేశాలతో ద్వైపాక్షిక, దౌత్య ఒప్పందాలను రద్దు చేస్తున్నామన్నారు.

గురువారం క్యాబినెట్ సమావేశం అనంతరం మాల్దీవుల అధ్యక్ష కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఫిజురుల్ మాట్లాడారు. భారతదేశం-మాల్దీవుల మధ్య హైడ్రోగ్రఫీ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని మాల్దీవుల అధ్యక్షుడు మరియు అతని మంత్రివర్గం నిర్ణయించుకున్నారని, ఒప్పందం ప్రకారం జూన్ 2024లో గడువు ఉంది. దీనిని పునరుద్ధరించకూడదని మాల్దీవులు అనుకుంటోంది. జూన్ 8, 2019న ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన సందర్భంగా హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ప్రకారం.. మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో, రీఫ్స్, లాగూన్స్, కోస్ట్ లైన్స్ వెంబడి ప్రాదేశిక జలాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి భారత్‌కి అనుమతి ఉంది.

కొత్తగా బాధ్యతలు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మయిజ్జు ఇప్పటికే మాల్దీవుల్లో భారత సైనికులు ఉనికి ఉండకూడదని అన్నారు. ఇదే సమయంలో తాము ఇతర దేశాల సైనికులకు ఆహ్వానం పలకమని చెప్పారు. తాను అధ్యక్షుడినైతే, మాల్దీవుల సార్వభౌమత్వాన్ని కాపాడుతానని, భారత సైనికులను వెళ్లగొడతాననే హామీ ఇచ్చాడు. దీంతో భారత వ్యతిరేక విధానాలకు తెరతీశారు.