Leading News Portal in Telugu

Dawood Ibrahim : ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం


Dawood Ibrahim : ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం

Dawood Ibrahim : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై విషప్రయోగం చేశారన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కరాచీలో విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం.. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అయితే దావూద్ విషప్రయోగం చేశాడన్న వార్త ఏ రిపోర్టులోనూ ధృవీకరించబడలేదు. దావూద్‌ చేరిన ఆస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆసుపత్రిలోని ఆ అంతస్తులో దావూద్ ఒక్కడే రోగి. ఉన్నత ఆసుపత్రి అధికారులు, వారి సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే అంతస్తులో ప్రవేశం ఉంది.

పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ డౌన్
పాకిస్థాన్‌లో దావూద్‌పై విషప్రయోగం జరిగిందన్న వార్తతో ఆ దేశంలో కలకలం రేగింది. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి దేశంలోని అనేక పెద్ద నగరాల్లో కూడా సర్వర్లు పనిచేయవు. ఇది కాకుండా ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా పనిచేయడం లేదు. రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే నెట్‌బ్లాక్ అనే సంస్థ పాకిస్థాన్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధాన్ని ధృవీకరించింది.

పాకిస్థాన్ జర్నలిస్ట్ ఏం చెప్పాడు?
పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్జూ కజ్మీ మాట్లాడుతూ, “దావూద్ ఇబ్రహీంపై ఎవరో విషం పెట్టినట్లు వినిపిస్తోంది. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్షీణించింది. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతన్ని కరాచీలోని ఆసుపత్రిలో ఉంచారు. ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఎక్కడో సోషల్ మీడియాలో.. ఇది ఎంత వరకు కరెక్ట్ అని నాకు తెలియదు, కానీ ఒక విషయం ఏమిటంటే, ఈ విషయంలో ఏదో చీకటి కోణం ఉందని తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని సోషల్ మీడియా, ఇంటర్నెట్ సర్వర్‌లను డౌన్ చేశారు.” అని చెప్పాడు.