Leading News Portal in Telugu

Sunspot: భూమికి ఎదురుగా సూర్యుడిపై భారీ సన్‌స్పాట్.. భూమి కన్నా రెండింతలు పెద్దది..


Sunspot: భూమికి ఎదురుగా సూర్యుడిపై భారీ సన్‌స్పాట్.. భూమి కన్నా రెండింతలు పెద్దది..

Sunspot: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలకు చేరుకున్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలం క్రమంగా అలజడిగా మారుతోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం సన్‌స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలు ఎక్కువ అవుతున్నాయి. సూర్యుడిపై ఏర్పడే భారీ పేలుళ్ల కారణంగా పదార్థం అంతరిక్షంలోకి వెదజల్లబడుతోంది. దీని కారణంగా భూమిపై సౌరతుఫానులకు ఏర్పడుతున్నాయి.

తాజాగా భూమికి ఎదురుగా సూర్యుడి ఉపరితలంపై భారీ సన్‌స్పాట్స్ ఏర్పడ్డాయి. దీంట్లో ప్రతీ ఒక్కడి భూమి కన్నా రెండు రెట్లు పెద్దదిగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం 48 గంటల్లోనే ఈ సన్‌స్పాట్ల పరిమాణం నాలుగు రెట్లు పెరిగిందని నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) వీడియోలో తెలుస్తోంది. పేలుడు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

AR3529 అని పిలువబడుతున్న ఈ సన్‌స్పాట్స్ అస్థిర ‘డెల్లా-క్లాస్’ అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో నెగిటివ్, పాజిటివ్ అయస్కాంత ధ్రువణాలు అస్థిరం వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది అత్యంత తీవ్రమైన సౌరజ్వాలలను ప్రేరేపిస్తుంది. ఈ సౌరజ్వాలలు భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. జీపీఎస్ నావిగేషన్‌ని ప్రభావితం చేస్తుంది, పవర్ గ్రిడ్ వైఫల్యాలు తలెత్తవచ్చు.

అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ఛార్జుడ్ పార్టికల్స్‌ని అడ్డుకుని, భూమిపై జీవజాలానికి ఎలాంటి ఆపద లేకుండా రక్షిస్తుంది. ఈ సౌరజ్వాలలు భూమిపై భూ అయస్కాంత తుఫానులను సృష్టిస్తుంది. వీటి వల్ల ధృవాల వల్ల ఆరోరాలు అని పిలువబడే కాంతి కనిపిస్తుంది.