Leading News Portal in Telugu

Pakistan : షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం.. 9మంది మృతి


Pakistan : షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం.. 9మంది మృతి

Pakistan : ఆదివారం వాయువ్య పాకిస్థాన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి మట్టి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒక మహిళ, ఆమె ఎనిమిది మంది పిల్లలు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అబోటాబాద్ జిల్లా తహరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ, ఆమె నలుగురు కూతుళ్లు, ఎనిమిది మంది చిన్నారులు మరణించారని తెలిపారు. కూలిన భవనం శిథిలాల నుంచి స్థానికులు తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారని తెలిపారు. మృతుల వయస్సు తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మూడు అంబులెన్స్‌లు, స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు రెస్క్యూ అధికారులు శాయశక్తులా కృషి చేశారు. ఇదిలా ఉండగా, ఖైబర్ ఫక్తున్‌ఖ్వా తాత్కాలిక ముఖ్యమంత్రి అర్షద్ హుస్సేన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద సంఘటనకు కారణాన్ని అన్వేషించడానికి.. ప్రాంతంలోని ఇతర నివాసితుల భద్రతను నిర్ధారించడానికి అధికారులు కూడా కృషి చేస్తున్నారు. జూలైలో లాహోర్‌లోని భాటి గేట్ ప్రాంతంలోని ఒక ఇంటిలో రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలడంతో ఒక శిశువు, ఒక మహిళతో సహా ఒక కుటుంబంలోని 10 మంది సభ్యులు ఘోరమైన అగ్నిప్రమాదంలో మరణించారని జియో న్యూస్ నివేదిక తెలిపింది. ఈ ప్రమాదంలో మృతుల్లో ఓ వ్యక్తి, అతని భార్య, మరో ఇద్దరు మహిళలు, ఐదుగురు పిల్లలు, ఏడు నెలల పాప ఉన్నారు. కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే భవనంపై నుండి దూకి ఘోరమైన మంటలను తప్పించుకోగలిగాడు. రిఫ్రిజిరేటర్ కంప్రెసర్‌లో పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు రెస్క్యూ అధికారులు నిర్ధారించారు. పొగ బయటకు వెళ్లేందుకు ఇంట్లో వెంటిలేషన్‌ లేదన్నారు.