Leading News Portal in Telugu

Christmas Party: వికటించిన క్రిస్మస్ విందు… 700 మంది అస్వస్థత


Christmas Party: వికటించిన క్రిస్మస్ విందు… 700 మంది అస్వస్థత

ప్రపంచమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. సెమి క్రిస్మస్ అంటూ నెల రోజులు ముందు నుంచే సెల్రబేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు వికటించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. పశ్చిమ ఫ్రాన్స్ ‌‌లోని మోంటోయిర్ డి బ్రిటేన్‌లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు డిసెంబర్ 24న క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేశారు.

కంపెనీ సమీపంలోని ఓ రెస్టారెంట్ గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ విందులో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారి కోసం రకరకాల నోరురించే వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో లాబ్ స్టర్లు, ఆల్చిప్పలు, బీఫ్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. అయితే, విందు అనంరతరం దాదాపు 700 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో కొందరు ఉద్యోగులకు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన వారందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎయిర్ బస్ అట్లాంటిక్ తమ ఉద్యోగులకు మెరుగైన వైద్య ఏర్పాట్లు చేసింది.

వారంత వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ (ARS) ధృవీకరించింది. ఆహారం నాణ్యత లోపం వల్లే తమ వారు అస్వస్థకు గురయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సదరు రెస్టారెంట్‌పై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పశ్చిమ ఫ్రాన్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. విందులో ఏ రకమైన ఆహారాన్ని అందించారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.