
క్రిస్మస్ వేళ ఆకాశంలో అద్భుతం సృష్టించారు. నెల రోజుల ముందే అమెరికాలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒక్కో స్టేట్ ఒక్కోరకంగా క్రిస్మస్ పండుగ ఏర్పాట్లను నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్‌లో డ్రోన్ షోతో పండగకు శోభ తెచ్చారు. టెక్సాస్ ప్రజల విన్నూత్న ప్రదర్శనకు ఏకంగా వరల్డ్ గిన్నిస్ బుక్కే ఫిదా అయ్యింది. అక్కడ నిర్వహించిన 1500 డ్రోన్ల ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. కాగా గత వారం టెక్సాస్‌లో స్కై ఎలిమెంట్స్ డ్రోన్ షో కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్, ఇతర ఫెస్టివ్ ఇమేజ్‌లను ప్రదర్శించారు. ఇందుకోసం భారీగా డ్రోన్లను ఉపయోగించారు. మిరుమిట్లు గొలిపే కాంతులతో చేసిన డ్రోన్ల ప్రదర్శనను 2 వేల మందికి పైగా తిలకించారు. డ్రోన్లతో ఏర్పడిన అతి పెద్ద ఏరియల్ డిస్‌ప్లే ఈ షో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వివిధ ఆకృతుల కోసం మొత్తం 1499 డ్రోన్లను వినియోగించారు. ఫిక్షనల్ కేరెక్టర్ కోసం ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్లను వినియోగించడం ఓ రికార్డు. అలాగే డ్రోన్లతో రూపొందిన భారీ క్రిస్మస్ ట్రీ ఆకృతి సహజత్వం ఉట్టిపడేలా ఉండటంతో వీక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ షోను నిర్వహించడానికి 40 మంది సిబ్బంది శ్రమించి ఆకాశంలో అద్భుతం చేశారు.
GUINNESS WORLD RECORD Christmas Drone Show with +1,500 Drones! pic.twitter.com/acRhj14I3R
— Tansu Yegen (@TansuYegen) December 25, 2023