
Texas Road Accident: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారు దగ్గరి బంధువులుగా తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే సతీష్ బాబాయి నాగేశ్వరరావు. ఆయన భార్య, కూమార్తె, ఇద్దరు చిన్నారులు మరణించారు. ఎమ్మెల్యే సతీష్ బాబు చిన్నాన్న కూమర్తె నవీన గంగ, అల్లుడు లోకేష్ తమ ఇద్దరు పిల్లలు టెక్సాస్‌లో ఉంటున్నారు.
ఈ క్రమంలో 6 నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీనతో కలిసి తండ్రి నాగేశ్వరరావు, తల్లి సీతామహాలక్ష్మి టెక్సాస్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఫ్యామిలీ మొత్తం టెక్సాస్ నుంచి డల్లాస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టెక్సాస్‌లోని జాన్సన్ కౌంటీ వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే చిన్నాన్న, చిన్నమ్మ, వారి కూతురు, మనవడు, మనవరాలు మరో బంధువు అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.