Leading News Portal in Telugu

Google: గూగుల్‌పై లా సూట్.. రూ.41 వేల కోట్ల పరిహారం చెల్లింపుకు సిద్ధం?


Google: గూగుల్‌పై లా సూట్.. రూ.41 వేల కోట్ల పరిహారం చెల్లింపుకు సిద్ధం?

టెక్ కంపెనీ గూగుల్‌కు బిగ్ షాక్ తగిలింది. ‘ఇన్‌కాగ్నిటో (Incognito)’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ ట్రాక్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఓ కంపెనీ గూగుల్‌కు వ్యతిరేకంగా ‘క్లాస్ యాక్షన్ లా సూట్’ దాఖలు చేసింది. ఈ కేసు కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి య్వోన్నె గొనాలెజ్ రోజర్స్ ధర్మాసనం విచారించింది. అయితే మొదట ఈ కేసును కొట్టివేయాల్సిందిగా గూగుల్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో పిటిషనర్‌తో రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు గూగుల్ ముందుకు వచ్చింది.

గూగుల్ అభ్యర్థన విన్న జడ్జి ఒప్పందం కుదిరే వరకు విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సదరు పిటిషనర్‌కు రూ.41 వేల కోట్లు (500 కోట్ల డాలర్లు) చెల్లించేందుకు గూగుల్ సిద్ధమైనట్టు సమాచారం. పిటిషనర్, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి పూర్తి స్పష్టత లేకున్న న్యాయవాదులు తమ రాజీ ఒప్పందానికి కట్టుబడి ఉంటామన్నారు. దీంతో రాజీ ఒప్పందానికి గడువు ఇస్తూ తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 24కు కోర్టు వాయిదా వేసింది. పటిషినర్‌కు ఎలాంటి అభ్యంతరం లేకుండ ఉంటే ఈ ఒప్పందాన్ని అమోదిస్తామని కోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది.

కాగా ‘ఇన్‌కాగ్నిటో‌’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ తన గూగుల్ అనలిటిక్స్, కుకీస్, యాప్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నదని సదరు కంపెనీ తన పటిషన్‌లో ఆరోపించింది. అయితే దీనిపై గూగుల్ స్పందిస్తూ.. అసలు ‘ఇన్‌కాగ్నిటో మోడ్‌‌ అంటేనే ప్రైవేట్‌గా బ్రౌజింగ్ చేసే పద్దతి, దానిని తీసువచ్చిందే గూగుల్.. ఈ మోడ్‌లో ఇంటర్నేట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ ‘బ్రౌజింగ్ హిస్టరీ’ని కుకీస్ ట్రాక్ చేయడం కుదరని గూగుల్ వివరణ ఇచ్చుకుంది. కానీ, పిటిషన్ దాఖలు చేసిన సంస్థ మాత్రం ఇన్‌కాగ్నిటో బ్రౌజ్ చేసిన స్నేహితులు, హాబీలు, ఫేవరెట్ ఫుడ్, షాపింగ్ హాబిట్స్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ దొంగిలిస్తుందని పటిషినర్ నొక్కి చెప్పారు.

దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రోజర్స్ గూగుల్‌పై మండిపడ్డారు. ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజింగ్ చేస్తున్న యూజర్ల డేటాను సేకరించబోమని తాము చేప్పిన వాగ్ధానానికి గూగుల్ కట్టుబడి ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. 2016 జూన్ ఒకటో తేదీ నుంచి లక్షల మంది యూజర్ల డేటాను గూగుల్ దొంగలించినట్టు 2020లో సదరు సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇది కాలిఫోర్నియా వ్యక్తిగత గోప్యత చట్టాలను ఉల్లంఘించడమేనని, యూజర్లకు 5000 డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేసింది.