
Kansai International Airport: జపాన్ లో ప్రతిష్టాత్మకంగా 20 బిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మించిన విమానాశ్రయం మెల్లమెల్లగా మునిగిపోతోంది. జపాన్‌లోని గ్రేటర్ ఒసాకా ప్రాంతంలో ఉన్న ఈ విమానాశ్రయం ఒక కృత్రిమ ద్వీపంలో నిర్మించబడింది. కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం 1994 సెప్టెంబర్ 4న ప్రారంభించింది. ఈ ఎయిర్ పోర్ట్ ఒసాకా ద్వీపాంతో పాటు ప్రపంచం మొత్తానికి కలుపుతుంది. అంతే కాదు ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాఫిక్ కూడా తగ్గింది. ముఖ్యంగా, 2016లో ఈ ఎయిర్ పోర్ట్ ఆసియాలో 30వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా నిలిచింది. జపాన్‌లో మూడవ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ గా ఉంది.
కాగా, వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈ విమానాశ్రయం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు తెలిపారు. ఒసాకాతో పాటు ఈ ఎయిర్ పోర్ట్ క్యోటో, కోబ్ ప్రజలకు కూడా ప్రధాన రవాణా కేంద్రంగా ఉంటుంది. దీని రన్‌వే దాదాపు 4000 మీటర్ల పొడవు ఉంది.. ద్వీపంలోని ఈ విమానాశ్రయం బీచ్ నుంచి రెండు మైళ్ల దూరంలో ఉంది. దీని పనులు 1987లో ప్రారంభమై 7 ఏళ్లలో పూర్తైంది. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం తర్వాత ఏవియేషన్ హబ్‌గా మారింది. ఈ విమానాశ్రయాన్ని మారుమూల ప్రాంతంలో నిర్మించడంతో 24గంటలు విమాన సర్వీసులు కొనసాగాయి.
అయితే, లక్షలాది లీటర్ల నీటి పైన ఈ ఎయిర్ పోర్ట్ ను సిద్ధం చేశారు. కానీ ఇప్పుడు ప్రకృతి నియంత్రణలో లేదు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బ తింటుంది. ఈ విమానాశ్రయం భద్రత కోసం, ఉపరితలం బలంగా ఉండేలా రాళ్లను 80 షిప్ లలో తీసుకు వచ్చి.. 10 వేల మంది కార్మికులు, సుమారు 10 మిలియన్ గంటల పాటు పని చేశారు. ఈ రాళ్లను పోసిన తర్వాత దానిపై 30 నుంచి 40 మీటర్ల ఎత్తులో కృత్రిమ ఉపరితలాన్ని సృష్టించారు. అయినా కూడా సముద్రపు నీటి మట్టం పెరగడంతో ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్ట్ కు పెను ప్రమాదం అంచున ఉంది.